ఇకపై అంతులేని కోతలు
Publish Date:Oct 18, 2012
Advertisement
ముఖ్యమంత్రి, అమాత్యుల నిర్లక్ష్యంవల్ల రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ కొరత సంక్షోభం మరింతగా ముదిరింది. ఇప్పటివరకూ ఏడెనిమిది గంటలపాటు విధిస్తున్న విధిస్తున్న అనధికారిక కోతలు ఇకపై అధికారికంగా అనంతమైన స్థాయికి ఎదిగే దశకూడా వచ్చేసింది. ఇకపై రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా కరెంట్ ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం రోజుకి విద్యుత్ డిమాండ్ 295 మిలియన్ యూనిట్లు. సరఫరా మాత్రం 230నుంచి 233 మిలియన్ యూనిట్లు. అరవైనుంచి అరవై ఐదు మిలియన్ యూనిట్ల కొరతను భర్తీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని డిస్కామ్ సంస్థలు చేతులెత్తేశాయ్. రోజురోజుకీ డిమాండ్ బాగా పెరిగిపోవడం, లోటు మరింత ఎక్కువైపోవడంవల్ల ఇకపై ఎప్పుడు ఎన్నిగంటలపాటు విద్యుత్ కోత ఉంటుందోకూడా చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏపీ ట్రాన్స్ కో పూర్తిగా తన చేతికి మట్టంటకుండా చూసుకునే విధానాల్ని అవలంబిస్తోంది. అందుబాటులో ఉన్న విద్యుత్ ని డిస్కమ్ లకు కేటాయించి చేతులు దులుపుకోవాలని నిర్ణయించింది. అంటే.. కోతల తలనొప్పంతా పూర్తిగా డిస్కమ్ ల బాధ్యతేనన్న మాట.. లోటు ఎంత ఎక్కువగా ఉంటే కోతలు కూడా అంత ఎక్కువగా ఉంటాయ్.. గ్రామాల్లో అయితే రాత్రివేళల్లోకూడా నాలుగునుంచి ఆరు గంటలపాటు కరెంట్ ని కట్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/power-cut-in-ap-31-18295.html





