అందుబాటులోకి రోడ్ డాక్టర్ రోడ్లపై గుంతలు చిటికెలో మాయం!

Publish Date:Jun 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో  రోడ్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రోడ్లపై గుంతలు, గతుకులకు పర్మనెంట్ గా చెక్ పెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. అందులో  భాగంగానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ  రోడ్ డాక్టర్ అనే వినూత్న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం  చేపట్టింది. రోడ్లపై ఉండే గుంతలను వేగంగా, అత్యాధునిక సాంకేతికతతో పూడ్చేందుకు ఈ సరికొత్త విధానాన్నితీసుకువచ్చింది. సాధారణంగా ఏదైనా   రోడ్డు పనులు జరగాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది, కానీ ఈ రోడ్ డాక్టర్ విధానం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. 

ఈ   ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి,  మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.   స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే  ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను  గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా సమాచారం అందిన వెంటనే, సంబంధిత  రోడ్ డాక్టర్  ప్రత్యేక బృందానికి ఆటోమేటిక్‌గా అలర్ట్ వెళ్తుంది. సమాచారం అందిన  గంటల వ్యవధిలోనే ఆధునిక మిషనరీతో కూడిన ప్రత్యేక వాహనం ఆ ప్రాంతానికి చేరుకుని, ఆ గుంతలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చి రోడ్డును మునుపటిలా మార్చేస్తుంది.

ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ..  ప్రజల భద్రత,  సౌకర్యం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వినూత్న ఆలోచనకు స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కేవలం  గంటల వ్యవధిలోనే రోడ్డు సమస్యలు పరిష్కారం కావడం పట్ల   జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో..   ఈ సేవలను త్వరలోనే రాష్ట్రంలోని మరో  ఐదు  జిల్లా కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా రోడ్ డాక్టర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.  ఈ వ్యవస్థ  రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..  ఏపీ రోడ్ల రూపురేకలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
ముంబై నగర తాగునీటి జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా 9 శాతానికి పడిపోయాయి. అప్పర్ వైతర్ణ డ్యామ్ పూర్తిగా ఎండిపోగా, ఐఎండీ జూన్ 22 నుండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.