ఉడుతా ఉడుతా ఉచ్.. ఎక్కడి కెడతా ఉచ్ కొమ్మమీద జాంపండు కోసుకొస్తావా అంటూ చిన్న పిల్లలు చిన్నప్పుడు పాడుకునే పాట. అయితే ఇప్పుడు ఏపీలో ఉడుతలు జాంపడ్లు కొరకడం మానేశాయి. అవి హైటెన్షన్ విద్యుత్ విద్యుత్ వైర్లు కొరికే పనిలో బిజిగా ఉన్నాయి. ఔను నిజమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అదే చెబుతోంది. అదే నమ్మి తీరాలంటోంది. నమ్మకపోతే మీ ఖర్మ. కావాలంటే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కొరికి చనిపోయిన ఉడుత పోస్టు మార్టం రిపోర్టు చూడండంటోది.
ఏపీలో ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ ఉండదు. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడిన సంఘటనలో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. అయితే ఆ హైనెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని జనాలను నమ్మించడం ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన విషయం అయిపోయింది. లేకపోతే.. విద్యుత్ శాఖకు కనీసం మెయింటెయినెన్స్ కు కూడా నిధులు కేటాయించని ప్రభుత్వాన్ని జనం నిలదీస్తారు.
అందుకే ఆ వైర్లు తెగిపడటానికి కారణం ఉడేతేనని జనాన్ని నమ్మించడానికి మించిన ముఖ్యమైన పనేం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. విద్యుత్ అధికారులు ఉడుత కొరికేయడం వల్లే హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయని చెప్పారు. అక్కడితో ఊరుకోకుండా కరెంట్ స్తంభంపై చచ్చి పడున్న ఉడుతకు పోస్టు మార్టం చేయడానికి సిద్ధమైపోయారు. అసలు ఉడుత కొరికితే తెగిపడేంత బలహీనంగా హైనెన్షన్ విద్యుత్ వైర్లు ఉంటాయా? ఒక వేళ ఉడుత వాటిని కొరికి షాక్ కొట్టి చచ్చి ఉంటే.. అది కరెంట్ స్తంభంపై ఎందుకు ఉంటుంది. కాలి బూడిదై ఉండదా? ఇంత చిన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది?
సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించి, విద్యుత్ వైర్లను అదే కొరికేసిందని రిపోర్టు ఇవ్వడానికి ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ సిద్ధమైపోయింది. తామేం చెబితే అదే రైటు.. జనం నమ్మి తీరాలి అన్నతీరులో ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఉన్నాయి. అందుకే అంటారు యథా రాజా తథా అధికారులూ అని. జగన్ హయాంలో ఏం జరిగినా, ప్రభుత్వాధికారులు ఎన్ని వింత వింత పోకడలకు పోయినా అంతా జగన్మాయ అని సరిపెట్టుకోవాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/postmartum-to-aqurril-to-prove-it-is-the-culprit-39-138889.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.