పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు... కూట‌మిలో జోష్ పెంచిందా?

Publish Date:May 6, 2024

Advertisement

పోస్ట‌ల్ బ్యాలెట్ ఏపీ రాజ‌కీయాల్నే మ‌లుపు తిప్ప‌నుందా?   ప్రజలు ఎవరివైపు వున్నారు? అధికార‌, ప్ర‌తిప‌క్ష కూట‌మిలో అదే ఉత్కంఠ‌త‌.  మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నారు.. మ‌రో వైపు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ కూట‌మి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇరు ప‌క్షాలు  మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మారింది. ముఖ్యంగా పోస్ట‌ల్ బ్యాలెట్ గెలుపు ఓట‌మిల నిర్ణ‌యంలో కీల‌కంగా మార‌నుంది. మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించారు.

పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్,  రెండు రోజుల పాటు  కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు  85 ఏళ్ళు నిండిన వయో వృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈ నెల 3న స్టార్ట్ అయింది. ఈ నెల 10 వరకూ కొనసాగనుంది.  

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ తీరు చూస్తే, ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్థులలో అధికార పార్టీపై వున్న అస‌హ‌నం, ఆగ్ర‌హం స్ప‌ష్టంగా క‌న‌బ‌డింది.  ఉద్యోగులంతా తమవైపే అనుకున్న వైసీపీ ఇప్పుడు ఆలోచనలో పడింది.   పోస్ట‌ల్ బ్యాలెట్ తీరు చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వ‌స్తున్నాయి.   ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది అధికార పార్టీ, ఇప్పుడు చేతులెత్తేసింది. జీతాలు టైంకు ఇవ్వ‌కుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్ లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు ఉద్యోగ‌స్తులు ఇప్పుడు త‌మ ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో చూపారు.పోస్టల్ బ్యాలెట్ లో కూట‌మిదే పైచెయ్యి క‌నిపిస్తోంది.   
 
ప్ర‌భుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు. అయితే దీని మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరో వైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా, రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది డౌటే అన్న భావన కూడా ఉంది.  అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ కూటమి కూడా ఒకరిని మించిన తీరులో మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని వాళ్ళు భ‌య‌ప‌డుతున్నారు.  అందుకే ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.