వాళ్ల ఓట్ల కోసం గులాబీ వ్యూహాలు! పోసాని పాచిక పారేనా? 

Publish Date:Nov 21, 2020

Advertisement

గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లపై గులాబీలో గుబులుందా? పవన్ ఎంట్రీతో తమకు కష్టమని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారా? పోసానితో ప్రయోజనమెంత? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కీలకంగా మారిన సెటిలర్ల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కలిసి వచ్చే అన్ని అవకాశాలను పార్టీలు వాడేసుకుంటున్నాయి. అందులో భాగంగానే టీఆర్ఎస్ కు మద్దతుగా సినీ నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి  ప్రకటన చేశారని చెబుతున్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. గ్రేటర్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని పిలుపిచ్చారు. 

 

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటనపై జోరుగా చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కీలకంగా ఉన్న సెటిలర్ల ఓట్ల కోసమే టీఆర్ఎస్ పెద్దలు పోసానితో మాట్లాడించారనే వాదన వస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే సెటిలర్ల ఓట్లు బీజేపీ వైపు మళ్లవచ్చని అధికార పార్టీ ఆందోళన పడుతుందని తెలుస్తోంది. అందుకే పవన్ ప్రకటన చేసిన మరునాడే పోసాని మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు. తన ప్రసంగంలో ఆంధ్రావారి గురించి పదేపదే మాట్లాడారు పోసాని. తెలంగాణలో ఆంధ్రావారంతా సురక్షితంగా ఉన్నారని చెప్ప ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ కు ఆంధ్రా నాయకులే మీదే కోపం ఉండేదని, ఆంధ్ర అంటే కాదన్నారు పోసాని. కేసిఆర్ వస్తే ఆంధ్రవారిని తరిమి కొడతారని ప్రచారం జరిగిందని.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఆంధ్రవారి మీద దాడి జరిగిన ఘటనలు లేవన్నారు పోసాని.  

 

బీజేపీకి మద్దతూ తెలుపుతూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. హైదరాబాద్ ను సురక్షితంగా ఉంచే వారినే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ భద్రతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పోసాని. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ భద్రంగా ఉందని చెప్పారు. 35 ఏండ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, గతంలో హైదరాబాధ్ అంటే మత కల్లోలాలు గుర్తొచ్చేవని,  టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మత కల్లోలాలు ఆగిపోయాయని చెప్పారు పోసాని. ఎన్టీఆర్ తరువాత హైదరాబాధ్లో కేసీఆరే మత కల్లోలాలు లేకుండా చేశారన్నారు. గతంలో ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణలో  పచ్చదనం ఉండేది కాదని ..కానీ కేసిఆర్ వచ్చాకా తెలంగాణ అంతా పచ్చగా మారిందన్నారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రభావం సెటిలర్ల పడకుండా ఉండేందుకే.. టీఆర్ఎస్ కు మద్దతుగా పోసాని కృష్ణమురళి ప్రకటన చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  

 

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపు 60 డివిజన్లలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో  సీమాంధ్రులు ఉన్నారు. 2016  గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సెటిలర్ ఓటర్లు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని చెబుతారు. ఇప్పుడు కూడా వారి ఓట్లను గంప గుత్తగా తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకే మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్ ప్రగతి నివేదిక విడుదల చేస్తూ.. సెటిలర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాము కూడా సిద్దిపేట నుంచి వచ్చి హైదరాబాద్ లో  సెటిలయ్యామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా తమవారేనని చెప్పారు కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో 8 మంది సెటిలర్లకు టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. పోసాని కృష్ణమురళికి నిక్కచ్చిగా పేరుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారని,  ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతారనే అభిప్రాయం ఆయనపై ప్రజలకు ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని పోసాని చేసిన ప్రకటనపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నది మాత్రం చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.