పోసాని రాజకీయ సన్యాసం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లేగా?

Publish Date:Nov 21, 2024

Advertisement

పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు.

అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు. మీడియా మైకు దొరికితే చాలు అప్పటి విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కులం పేరు చెప్పి దూషణలకూ పాల్పడ్డారు. జగన్ వ్యతిరేకులను ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా జగన్ మెప్పు పొందవచ్చని పోసాని ఇష్టారీతిగా రెచ్చిపోయారు. ఆయన అప్పట్లో మాట్లాడిన ప్రతిమాటా ఇప్పుడు రివర్స్ లో తనను చట్టం చక్రబంధంలో ఇరికిం చేయడం ఖాయమని అర్ధమైపోయింది. దీంతో పోసాని ప్లేట్ ఫిరాయించేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు. తనకు వైసీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదనీ, రాజీనామా చేసేశానని చెప్పేశారు.

జగన్ ఎంపీ, ఎమ్మెల్యేల కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్న పోసాని కృష్ణ మురళి అటువంటి నేతను క్లిష్ట సమయంలో వదిలేని వెళ్లిపోతున్నందుకు పనిలో పనిగా బాధ కూడా వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు మాట్లాడితే తిక్క, కోపం అంటూ విమర్శలు చేశారనీ, కానీ తాను ఇంత వరకూ మంచి నాయకులను ఎన్నడూ విమర్శించలేదనీ చెప్పుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తూ కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. చింత చచ్చినా పులుపు చావలేదని చాటుకున్నారు. తాను చంద్రబాబు, పవన్  కల్యాణ్ వంటి వారిపై చేసిన విమర్శలు వారి గుణగణాల ఆధారంగానే చేశానని ఏకంగా తన తల్లి మీద ప్రమాణం కూడా చేసేశారు.

ఇప్పుడు కూడా తాను రాజకీయాలకు దూరం కావడం తన కుటుంబ క్షేమం కోసమేనని చెప్పు కొచ్చారు. ఇక పనిలో పనిగా ఆయన తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘రాజా ఐ లవ్యూ’ రీతిలో  జగన్ ఐ లవ్యూ అని కూడా అనేశారు. ఆ వెంటనే ఇక తాను బతికున్నంత వరకూ రాజకీయాలు మాట్లాడనని శపథం చేసేసి, ఇలా అంటున్నానంటే కేసులకు భయపడుతున్నానని కాదనీ చెప్పుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అదే అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఎందుకంటే ఇంత కాలం లేనిది ఇప్పడు తన వాచాలత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదైన తరువాత ఒక్క సారిగా జ్ణానోదయమై రాజకీయా సన్యాసం ప్రకటించేయడానికి కారణం అరెస్టు భయం కాక ఇంకేమిటని నెటిజనులు పోసానిని తెగ ట్రోల్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.