Publish Date:Jun 28, 2025
పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తితో యాంకర్ స్వేచ్ఛ సహజీవనం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె ఒకరితో వివాహం అయ్యి తర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్రముఖ న్యూస్ ఛానెళ్లలో పని చేశారు. చనిపోయే నాటికి స్వేచ్ఛ టీ న్యూస్ యాంకర్ గా ఉన్నారు. అయితే ఆమెకు పూర్ణచంద్రరావు ఇక్కడే పరిచయం అయినట్టు తెలుస్తోంది. పూర్ణ టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ గా చేస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి మాటలను బట్టీ చూస్తే పూర్ణచంద్రరావు తన కూతురి వెంట మూడేళ్లు పడ్డాడనీ.. తన భార్యను వదిలి నిన్నే పెళ్లాడుతానంటూ అతడు ఆమెను నయానా భయానా ఒప్పించాడనీ.. ఇందువల్లే ఆమె ఇతడితో సహజీవనం చేస్తూ వచ్చిందని అంటున్నారాయన.
అయితే గత కొంత కాలంగా స్వేచ్ఛ పూర్ణ మధ్య వివాదం నడుస్తోందని.. అతడ్ని పెళ్లి చేసుకోమని ఈమె ఎంత అడుగుతున్నా.. ఇంట్లో కన్విన్స్ చేయాల్సి ఉందని అతడు తప్పించుకుని వస్తున్నాడని అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఫైనల్ గా తామిద్దరం విడిపోదలుచుకున్నామని తనతో తన కూతురు చెప్పిందని అంటున్నారు స్వేచ్ఛ తండ్రి. ఏది ఏమైనా తన బిడ్డ చావుకు కారణం ఈ పూర్ణ చంద్ర రావే కాబట్టి అతడిపై తాను కేసు పెట్టానని చెబుతున్నారు స్వేచ్ఛ తండ్రి. అతడ్ని తాను చూడ్డం కూడా ఇదేనని.. ఇంత వరకూ తాను చూడలేదని.. అన్యాయంగా తన కూతురికి మాయ మాటలు చెప్పి.. మోసం చేసి, చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి గల కారణమైన ఇతగాడికి తగిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు యాంకర్ స్వేచ్ఛ తండ్రి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/poorna-chandra-rao-39-200837.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.