పొన్నవోలు... ద ఫ్యాక్షనిస్ట్ స్టోరీ..!

Publish Date:Sep 24, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

ఇది చాలా హాట్ గురూ.. పొన్నవోలు కెవ్వు కేక! ఎవరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి?  నెల్లూరుకు చెందిన ఈ కమెడియన్,  న్యాయవాది వృత్తిలోకి  ఎప్పుడు వచ్చారు? ఉమ్మడి హైకోర్టులో  2011లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి  చేసిన గొప్ప ఘనకార్యం ఏంటి?  నాటి  వైయస్ క్యాబినెట్ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు పొన్నవోలు అంటే  ఎందుకు అంత అసహ్యం?  పొన్నవోలు ఏం లాయర్? పొన్నవోలుకు  టాలెంట్ ఇల్లే  అని  వైయస్ షర్మిల ఎందుకన్నారు? టాలెంట్ లేని  అడ్వకేట్‌ను  అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ వరించడానికి  జరిగిన  క్విడ్ ప్రోకో లోగుట్టు ఏంటి? తిరుపతి లడ్డు రాగి బిందె, పంది కొవ్వు బంగారం విశ్లేషణతో జగన్‌రెడ్డికి మరింత తలనొప్పి తెచ్చిపెట్టిన పొన్నవోలు! ఫ్యాక్షనిస్టు బ్యాక్‌గ్రౌండ్ నుండి ఎదిగాను అంటున్న  సుధాకర్ రెడ్డి! నా ప్రాణలకు  ముప్పు పొంచి వుంది అని తీవ్ర ఆందోళ చెందుతున్నారా?  పొన్నవోలు పుట్టుపూర్వోత్తరాలపై   సమగ్ర కథనం మీ తెలుగువన్ జర్నలిస్ట్ లాండ్రీలో!

వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. వై.ఎస్.జగన్ ఎంత ప్రమాదంలో వున్నాడో అర్థం చేసుకోండి. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని, కుక్కుం కుక్కుం అని గుక్కపట్టి ఏడుస్తూ, అసలు ఎవడు మనోడో, ఎవడు పరాయి వాడో తెలియదు. అయినా జగన్ మాత్రం ఏది అయితే అది అయిందిలే అనే వున్నాడు అంటూ మళ్ళీ కుక్కుం కుక్కుం అని ఏడుస్తున్నాడండీ.. ఆయన కష్టం నాకు తెలుసు. అందుకే జగనన్నను కాపాడుకుందాం. ఇదొక్కటే మనం చేయాల్సింది... అన్నది వదిలేయండి. వీలుపడని పరిస్థితుల్లో వున్నాడు. జస్ట్ అండర్‌స్టాండ్. నాకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరి ఫీలింగూ తెలుసు. అందరూ రండి.. మీరందరూ ఏపీకి రండి. అందరి కలిసి పార్టీ చేసుకుందాం. ఒక్కరోజు మీటింగ్ పెట్టుకుందాం. అందరం కలసి భోజనం చేద్దాం... అని వైసీపీ వీరాభిమానులతో పొన్నవోలు గుక్కపెట్టి ఏడుస్తూ, బాధపడుతూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాక ఫలితాలకు ముందు లండన్‌లో వైసీపీ ఎన్నారైలతో పొన్నవోలు రక్తికట్టించిన డ్రామా ఇది. పొన్నవోలు నటనకి సినీ కళామతల్లి గర్వంతో ఉప్పొంగిపోయిన క్షణాలవి. కళామతల్లి ముద్దుబిడ్డ, ఆర్టిస్టు పొన్నవోలు అంతటితో ఆగలేదు. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేవిధంగా ఒక ఫ్యాక్షనిస్టు అనేవాడు చాలా గొప్పోడు. నేను ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చాను అని సొల్లారు. 

నెల్లూరు పట్టణంలో భాగమైన కనుమర్తిపాడు గ్రామంలో పుట్టిన పొన్నవోలు పులివెందుల బ్యాక్‌డ్రాప్ పిట్టకథ చెప్పుకొచ్చారు. మన నాయకుడు జగన్ తలుచుకుంటే ఈ నా కొడుకులను మూడ్రోజుల్లో లేపేస్తాడు అని జగన్ సమర్థ హత్యారాజకీయాలపై జగన్ పట్టును లండన్ వేదికగా సుస్పష్టంగా పొన్నవోలు తెలియజేశారు. ఇదే సమయంలో వైసీపీ ఉన్మాది ఒకడు ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తే చంపుకోవడానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నా అంటే, మన పోటుగాడు.. ఫ్యాక్షనిస్టు.. పొన్నవోలు అలాగే ఇద్దాం అన్నట్టు పళ్లు ఇకిలిస్తూ తన ఉన్మాదాన్ని కులగజ్జితో గోక్కున్నారు. 

అసలు ఎవరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి? వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎందుకంత ఆప్తుడయ్యారు? జగన్మోహన్‌రెడ్డి, పొన్నవోలు చేతులు కలపడం వెనుక బలమైన కుట్రకోణం దాగి వుంది. మామూలు కుట్ర కాదు.. మహా దారుణ కుట్ర దాగి వుంది. కపటత్వంలో జగన్‌రెడ్డిని బీట్ చేసేవాడు దేశంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. జగన్ అక్రమాస్తులపై కాంగ్రెస్ నేత పి.శంకర్‌రావు హైకోర్టులో 2011 ఆగస్టు 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 28న మొట్టమొదటిసారి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరు ప్రపంచానికి తెలిసింది. జగన్‌పై అనేక అక్రమాస్తుల కేసులు పొన్నవోలు లాయర్ కాబట్టి జగన్ తరఫున పొన్నవోలు కేసు వాదిస్తున్నాడేమో అనుకున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఇక్కడే నాడు జగన్ తెలివితేటలు మనం నోళ్ళు వెళ్ళబెట్టే సంఘటనలతో పొన్నవోలు ఎంట్రీ. నాడు ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదుదారుడిగా పొన్నవోలు ఎంట్రీ. అదేంటీ? పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోపు, తీస్‌మార్‌ఖాన్.. జగన్ కేసులు వాదించి బయట పడేస్తాడనుకుంటే, ఫిర్యాదుదారుడా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు.  కానీ, ఆ ఫిర్యాదు ఉద్దేశం జగన్ రెడ్డిని కేసుల నుంచి బయటపడేయడానికి దాగివున్న వ్యూహం. ఆనాడే రివర్స్ టెండరింగ్‌కి పాల్పడ్డ ఘనాపాఠీ జగన్‌రెడ్డి. 
తన అక్రమాస్తుల కేసు నెమ్మదించాలన్నా, ఆ కేసు నుంచి జగన్మోహన్‌రెడ్డికి విముక్తి కలగాలన్నా తన తండ్రి వైఎస్ నాటి అధికారిక వ్యవస్థ మంత్రులు, ఐఏఎస్‌లకు ఉచ్చు బిగిస్తే జగన్ తేలిగ్గా కేసుల నుంచి బయటపడవచ్చు అనే అతి భయంకరమైన, బీభత్సమైన తెలివితేటలతో పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నెల్లూరు నుంచి రంగంలోకి దింపి, జగన్ కేసుల్లో హైకోర్టులో ఫిర్యాదుదారు అవతారం ఎత్తిన, మన మాజీ ఫ్యాక్షనిస్టు గురిపెట్టిన ఫిర్యాదు తుపాకీ ఎవరిపైనో తెలుసా? నాటి పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, నాటి పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నాటి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఇంకో ఐఏఎస్ అధికారి శామ్యూల్, ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్, ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్‌పై హైకోర్టుకు పొన్నవోలు ఫిర్యాదు. వీళ్ళందర్నీ విచారించాలి. వీళ్ళకు కూడా జగన్ అక్రమాస్తులలో భాగస్వామ్యం వుంది అని సూపర్ తెలివి వాడటం జరిగింది. రివర్స్ టెండరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ మాదిరి ఈ రివర్స్ ఫిర్యాదు మతలబు ఏమిటంటే, ఇంతమంది మంత్రులు, సీనియర్ అధికారులు వారిని వారు రక్షించుకునే క్రమంలో జగన్మోహన్‌రెడ్డి కూడా ఆటోమేటిగ్గా రక్షించబడతాడు అనేది కుట్రకోణం. వాస్తవానికి వీరంతా జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులు పెరగడానికి, అనేక దారుణాలకు పాల్పడటానికి సహకరించినవారే. నల్లత్రాచుకు కోరల్లోనే విషం వుంటుంది. జగన్మోహన్‌రెడ్డి ప్రతి కదలికా, ప్రతి ఆలోచనా విషపూరితం అనేదానికి ఇదే నిదర్శనం. 

ఆనాడు తన అయ్య ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్, నాతోపాటు మీరూ జైలుకు రండి అని వీరిని ఆహ్వానించారు. పొన్నవోలు ఫిర్యాదుపై నీకేంటి సంబంధం అని కోర్టు కొట్టివేసింది. వెంటనే సుప్రీం కోర్టుకు పొన్నవోలు వెళ్ళారు. సుప్రీం కేసు విచారిస్తున్న సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మేము వారిని విచారించే పనిలో వున్నామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. నాటి ఏపీ ప్రభుత్వం మంత్రులకు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టులో కేసు వాదించుకోవడానికి లాయర్ల ఫీజు కింద కొంత సొమ్ము విడుదల చేసింది. దీనిపై కూడా కోర్టు లాయర్ ఫీజు జమా ఖర్చు వివరాలు ప్రభుత్వానికి తెలియపరచలేదని చెప్పి నాంపల్లి కోర్టులో వేరే వ్యక్తి చేత వీళ్ళపై ఫిర్యాదు చేయించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పొన్నవోలు చేత చేర్పించడం జరిగింది. 

2019లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వారు ముఖ్యమంత్రి అయిన సరిగ్గా ఆరో రోజు మన స్టోరీలో హీరో, మాజీ ఫ్యాక్షనిస్టు పొన్నబోలు సుధాకర్‌‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్‌గా నియమింపబడ్డారు. మన ఈ ఫ్యాక్షనిస్టు అంకుల్ పొన్నవోలు మాట్లాడుతూ, ‘‘నాకు జన్మ ఇచ్చింది నా తండ్రి అయినా, పునర్జన్మ ఇచ్చింది వైఎస్ జగన్. నేను ట్రైల్ కోర్టు అడ్వొకేట్ అయినా కూడా నాకు అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ పోస్టు ఇచ్చారు. పదేళ్ళుగా జగన్‌తో అనుబంధం వుంది. మా బంధం గురించి తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. నాకు వేరే మాస్క్ వేరే లేదు. జగన్ ఏం చెబితే అది చేస్తాను. నేను అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ అయినా, పార్టీలో సంబంధం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుణ్ణి కాదు. నాకు పునర్జన్మ ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి వుంటాను. ఆయన శ్వాసలోనే వుంటాను’’ అని ఇదివరకే ఒక ఇంటర్వ్యూ వేదికగా పొన్నవోలు క్లియర్‌కట్‌గా జగన్‌కి ఊడిగం చేస్తానని ఒప్పేసుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి, నేను జగన్ పాలేరునే, నేను జగన్ గుమస్తానే అని నిస్సిగ్గుగా ప్రకటించడం, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడటంలో ప్రధాన భూమిక పొన్నవోలు పోషించారు. 

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... ఆయన ఏం లాయరని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో గతంలో విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని ఆమె ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ వైఎస్‌ఆర్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి పేరు చేర్చినందుకు పొన్నవోలుకు అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ పదవి జగన్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు అలా చేశారని ఆమె అన్నారు. అత్యంత మేలు చేశారు కనుక, జగన్ సీఎం అయిన వారం లోగా ఏఐజీ పదవి బహుమతిగా ఇచ్చారన్నారు. పొన్నవోలుకు టాలెంట్ ఎక్కడుంది? స్వామిభక్తికి మెచ్చే ఆయనకు పదవి కట్టబెట్టారు అని ఆమె అన్నారు. మాజీ ఫ్యాక్షనిస్టు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ హోదా వెలగబెట్టే సమయంలో కోర్టు హాలులో విపరీతమైన సౌండ్ పొల్యూషన్, బల్లలు గుద్దడం, రంకెలు వేయడం సర్వసాధారణమని ఒక న్యాయవాది తెలియజేశారు. వైఎస్ షర్మిల అన్నట్టు పొన్నవోలు దగ్గర అడ్వొకేట్ టాలెంట్ లేదని, విషయం లేకపోతేనే కదా బయట మీడియాతో మితిమీరిన, అర్థంపర్థం లేని వాగుడు. 

జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దేశ విదేశాల్లోని భక్తులు ఆగ్రహావేశాలతో రగిలిపోతుంటే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దేశ రాజధాని వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డును రాగి బిందెతో, పంది కొవ్వును బంగారంతో పోల్చి కలకలం రేపారు. నెయ్యి కంటే పంది కొవ్వు ఖరీదని, అలాంటి ఖరీదైన పంది కొవ్వును లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో ఎవరైనా కలుపుతారా అని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరఫున పొన్నవోలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడి ఈ విధంగా స్పందించారు. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి ఖరీదు కిలో 319 అని, అదే పంది కొవ్వు కేజీ ధర 12 వందల వరకు వుంటుందని తెలిపారు. లడ్డూ తయారీలో నెయ్యికంటే విలువైన పంది కొవ్వును ఎవరైనా కలుపుతారా? రాగి బిందె తయారీలో ఎవరైనా బంగారాన్ని వాడతారా? బంగారంలో ఇత్తడి కలుపుతారుగానీ, ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్‌రెడ్డిని కాపాడటానికి, కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి వెరపు లేకుండా పందికొవ్వు, బంగారం, లడ్డూ, ఇత్తడి అంటూ పిచ్చి ప్రేలాపనలు, రోత పోలికలు తీసుకురావడం పొన్నవోలు బరితెగింపుకు నిదర్శనం అని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. పొన్నవోలు చెప్పిన యానిమల్ ఫ్యాట్ ధరల వివరాలు పూర్తిగా అవాస్తవాలు. యానిమల్ ఫ్యాట్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలకంటే తక్కువకే దొరుకుతున్న పరిస్థితి వుంది. పొన్నవోలు వ్యాఖ్యలపై ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజును స్పందన కోరగా తోలుమందం, కులగజ్జి కుక్కతో మాజీ ఫ్యాక్షనిస్టు పొన్నవోలును ఆయన పోల్చారు. 

By
en-us Political News

  
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.