Publish Date:May 23, 2023
ఖమ్మం పాలిటిక్స్ రసకందాయంలో పడింది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన పొంగులేటి , మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటుంది. పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ వాఖ్యానించారు.
పొంగులేటి డబ్బులు చూసుకొని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే తన సొంత పార్టీ నేతలనే ఓడించాలని ఆయన కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు జూపల్లిని కూడా సస్పెండ్ చేసింది బిఆర్ఎస్ . కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పొంగులేటి నోటికి తాళం వేయాలని బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పొంగులేటికి కౌంటర్ ఇచ్చేందుకు పువ్వాడ సిద్దమయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అన్న పువ్వాడ పొంగులేటి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఏపార్టీలోకి వెళ్ళాలనేది తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్నారు. ఇక పేదలను పీడించుకొని తిన్న దోపిడీదారులే ఆయన పంచన చేరారని, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని పువ్వాడ ధ్వజమెత్తారు.
పువ్వాడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్ కుమార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పువ్వాడపై బచ్చాగాడిని పెట్టినా గెలిపిస్తానని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-versus-puvvada-39-155805.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.