రాజకీయం సరే రాజనీతిజ్ఞత ఎక్కడ?

Publish Date:May 26, 2022

Advertisement

రాజకీయ నాయకులు రేపటి ఎన్నికల గురించి మాత్రమే అలోచిస్తారు, రాజ నీతిజ్ఞులు రేపటి తరం గురించి ఆలోచిస్తారని, అంటారు. అయితే, ప్రస్తుతం మనకు రాజకీయ నాయకులు కనిపించినంతగా, రాజనీతిజ్ఞులు కనిపించరు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందో వేరే చెప్పనక్కరలేదు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నప్పుడు, ప్రోటోకాల్ ఉన్నా లేకున్నా ఆయనకు స్వాగతం పలకడం, రాష్ట్ర ముఖ్యమంత్రి పాటించవలసిన కనీస మర్యాద. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రోటోకాల్ ను పక్కన పడేసి, రాజకీయ యాత్ర మీద పక్కరాష్ట్రానికి వెళ్ళారు. 

అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ నాయకుడే కానీ, రాజనీజ్ఞుడు కాదని తనకు తానే మరొక్క సారి నిరుపించుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచిన వెంటనే, అంతవరకు ఉద్యమ పార్టీగా ఉన్న తెరాస, ఇక పై ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీగా ఉంటుందని ప్రకటించారు. ఇక అక్కడ నుంచి తెరాస ప్రస్థానం ఆ దశగానే సాగుతోంది. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు తెరమరుగై పోయారు. అప్పట్లో ఉద్యమ ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసుకున్న తలసాని, ఎర్రబెల్లి, సబిత ఇంద్రారెడ్డి ఇత్యాదిగా గల ఇతర  పార్టీ;ల నాయకులకు కేసీఆర్ పార్టీలో, పదవుల్లో పెద్ద పేట వేశారు. ఆ విధంగానూ, ముఖ్యమంత్రి కేసీఆర్, తానేమిటో  మరోసారి రుజువు చేసుకున్నారు. 

నిజమే, కేసీఆర్ కానీ, మరొకరు కానీ, రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు, నిజానికి, రాజకీయ ఆశలు లేని రాజకీయ నాయకులు ఎవరూ ఉండరు. కేసీఆర్’కు ప్రధాని కుర్చీమీద ఆశ ఉండడం తప్పుకాదు, అలాగే మంత్రి కేటీఆర్’కు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆశ ఉంటే అదీ తప్పు కాదు. అదే ఆశ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితకు ఉన్నా అందులో అవగింజలో అరవయ్యో వంతు తప్పుందని ఎవరూ అనరు.. అనలేరు.అయితే, ముఖ్యమంత్రి పీఠం నుంచి ప్రదాని కుర్చీకి నిచ్చెనలు వేస్తున్న కేసీఆర్, ప్రస్తుత హోదాకు కాసింత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని, పరిశీలకులు, ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ వైరం కారణంగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేర్పాటువాద నాయకుడి తరహాలో, సమాఖ్య స్పూర్తిని చిన్నబుచ్చడం రాజకీయంగానే కాదు రాజ్యాంగ పరంగాను తప్పిదమే అవుతుందని విజ్ఞులు, విమర్శకులు అంటున్నారు.  

అంతే కాకుండా, రచ్చ రచ్చగా మారిన ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ప్రతి చిన్న విషయం, థాంక్స్ టూ సోషల్ మీడియా, పబ్లిక్ టాకై కూర్చుంటోంది.ఈ నేపధ్యంలో, ముఖ్యమంత్రి ప్రధాని అధికార పర్యటనను ఇగ్నోర్ చేయడం సామాన్య పబ్లిక్’కే  కాదు తెరాస నాయకులు, క్యాడర్’కు కూడా అంతగా రుచించడం లేదు. మాజీ ప్రధాని దేవెగౌడను, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఈరోజు కాకపోతే రేపు కలసినా పెద్దగా, తేడా ఉండదు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయ విధానం, కూటమిని ఏర్పాటు చేయడం ఒక రోజుతో అయ్యే పని కాదు.అలాటప్పుడు, ఆ సాకున, ప్రధాని పర్యటనలో మర్యాద పాటించక పోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని తెరాస నాయకులే అంటున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రోటోకాల్ నిబంధనలు అయినా పాటించక పోవడం రాష్ట్ర ప్రతిష్టను సైతం దిగాజారుస్తుందని అంటున్నారు. 

“ముఖ్యమంత్రి జాతీయ ప్రత్యాన్మాయ విధానాలు, కూటమి ఏర్పాటుకు చేస్తున ప్రయత్నాలను ఎవరూ కాదనరు. అయితే, అందుకు ఎంచుకున్న సమయం విషయంలోనే అనుమానాలు వ్యక్తమావుతున్నాయి” అని  తెరాస  నాయకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రధానిని కలిసేందుకు ముఖ్యమంత్రి ఎందుకో భయపడుతున్నారనే ప్రచారం జరగడం పార్టీ ప్రతిష్టనే, కాకుండా రాజకీయంగా పార్టీ ప్రయోజనాలనూ దెబ్బ తీస్తుందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి మాత్రం తగ్గేదేలే’ అంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాలు, రాజ్యంగం, రాజనీతి మధ్యగల వ్యత్యాసాన్ని తోసిరాజని, ముందుకు సాగుతున్నారు. బహుశా  ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు బెంగాల్ దీదీ బాటలో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు, కావచ్చును, కానీ, బెంగాల్ ఫార్ములా తెలంగాణలో పనిచేస్తుందా? అక్కడ మమత సాధించిన హ్యాట్రిక్ విజయం ఇక్కడా వర్క్ అవుట్ అవుతుందా? చూడాలి కాలమే సమాధానం చెప్పాలి, అంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.