యుక్త వ‌య‌స్సులో అవినీతి.. వృద్ధ వ‌య‌స్సులో జైలు.. జ‌గ‌న్ రెడ్డిదీ అదేదారా?

Publish Date:Jan 30, 2025

Advertisement

న్యాయవ్యవస్థను మోసం చేయడం దేశద్రోహాన్ని మించిన నేరం. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు.  దేశంలో సామాన్యులు చట్టాలని, న్యాయ తీర్పులను గౌరవిస్తూ శిక్షలు  అనుభవిస్తున్నారు. అయితే రాజకీయంగా ఉన్నత స్థాయిల్లో ఉన్న నాయకులు మాత్రం  వేల కోట్ల ప్రజా ధనం స్వాహా చేసి, న్యాయవ్యవస్థను తప్పుతోవ పట్టిస్తూ, చట్టాలను అడ్డు పెట్టుకొని  శిక్ష పడకుండా ఏళ్ల తరబడి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాజకీయంగా ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌లు.. వారు దోచేస్తున్న ప్రజాధనం, వారు గ‌డుపుతున్న విలాసవంతమైన జీవితాల గురించి అనేక దేశాల న్యాయవిద్యలో పలు అంశాలు ప్రముఖ ఉదాహరణలుగా బోధిస్తుండ‌టం గ‌మ‌నార్హం. భార‌త‌దేశంలో పాల‌క వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఆస్తులు కూడబెట్టిన వారు ఎందరో ఉన్నారు.  వారిలో చాలామంది జైలు శిక్షలు అనుభవించారు. అయితే, అటువంటి వారిపై కేసులు  13 నుంచి 20ఏళ్ల వరకూ సుదీర్ఘంగా విచారణ సాగడంతో అటువంటి వారు జీవిత చ‌ర‌మాంకంలో జైలు కెళ్తున్నారు. కోట్లాది రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డిన వ్య‌క్తి  66 నుంచి 78 ఏళ్ల మధ్య వయస్సులో కోర్టులు శిక్ష విధిస్తే లాభమేమిటి..?  అలాంట‌ప్పుడు అది శిక్ష కాదు.. ఒక విధంగా చూస్తే అది వారికి వరం అనే చెప్పాలి.  ఎందుకంటే.. వారికి జైలు శిక్ష ప‌డే స‌మ‌యానికి ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ ఉండని పరిస్థితి.  ఆ దశలో కోర్టు వీరిని జైల్లో కూర్చోబెట్టి వారికి సౌకర్యాలు కల్పించి వారి ఆరోగ్యపరమైన అలనాపాలనా చూసేందుకు సిబ్బందిని నియమించడంతో రాజభోగాలు అనుభవిస్తారు.

దేశంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికపరమైన నేరాలకు పాల్పడిన ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వారిలో కొంద‌రికి శిక్ష‌లు ప‌డ్డాయి. అయితే, వారిపై కేసుల విచార‌ణ సుదీర్ఘ‌ కాలం కొన‌సాగ‌డంతో వారికి శిక్ష‌లు ప‌డే స‌మ‌యానికి వారు వృద్ధాప్యానికి చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రిని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. ఓం ప్రకాష్ చౌతాలా, లాలూ ప్రసాద్ యాదవ్,   జయలలిత వంటి వారి గురించి చెప్పుకోవాలి. ముందుగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాల గురించి  చెప్పుకుంటే.. ఈయన పాతికేళ్ల  కిందట హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999-2000లో జూనియర్ బేసిక్ ట్రెయిన్డ్  టీచర్ల నియామక కుంభకోణంలో  భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. ఈ కేసు విచార‌ణ న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో సుదీర్ఘ‌ కాలం సాగింది. ఎట్టకేలకు 2013 జనవరి 22న ఆయనకు 10ఏళ్లు జైలుశిక్ష ప‌డింది. శిక్ష పడిన సమయానికి  ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించి 2021లో విడుదలయ్యారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విష‌యానికి వ‌స్తే.. ఆమె 1991-1996 మధ్య కాలంలో 66.65 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులను క‌లిగి ఉన్నార‌నే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈకేసు 1996 నుండి 2014 వరకు కోర్టులో విచార‌ణ జ‌రిగింది. చివ‌రికి సుదీర్ఘ‌కాలం త‌రువాత 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్లు జైలు శిక్ష ప‌డింది. అయితే, 2015లో ఆమెను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆమెకు శిక్షప‌డిన స‌మ‌యంలో ఆమె వయస్సు 66 సంవత్సరాలు. కేవ‌లం 21 రోజులు మాత్రమే ఆమె జైలుజీవితం గ‌డిపారు. 

ఆ తరువాత దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గడ్డి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు 1996 నుండి 2018 వరకు వివిధ కోర్టుల్లో విచార‌ణ జ‌రిగింది. సుదీర్ఘ‌కాలం విచార‌ణ త‌రువాత 2013లో ఐదేళ్ల పాటు కోర్టు ఆయ‌న‌కు జైలు శిక్ష విధించింది. అప్పుడు ఆయ‌న వ‌య‌స్సు 65ఏళ్ళు. మూడున్న‌రేళ్లు జైలు జీవితం గ‌డిపాడు.  ఇలా.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన వారంతా 10 నుంచి 20యేళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌రువాత వృద్ధాప్యంలో జైలుకెళ్లిన ప‌రిస్థితి. ఇదే త‌ర‌హాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసును చెప్పుకోవ‌చ్చు. జ‌గ‌న్ రెడ్డిపై అనేక అక్ర‌మాస్తుల కేసులు ఉన్నాయి. ఆయ‌న‌పై ఎన్ని కేసులున్నా ఇప్ప‌టికీ బెయిల్ పై సుదీర్ఘ‌కాలం బ‌య‌ట‌నే ఉంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆయన కోర్టులో వాయిదాల‌కు కూడా హాజ‌రు కాలేదు. న్యాయస్థానానికి వెళ్లకుండా ఎలా మైంటైన్ చేస్తున్నారు. అ చట్టాలకు ఆయనేమైనా అతీతుడా.. సామాన్య ప్ర‌జ‌ల‌కు లేని న్యాయ‌ప‌ర‌మైన సౌల‌భ్యం ఆయ‌న‌కు ఎందుకు కోర్టులు క‌ల్పిస్తున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది. 

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి 2004-2009 కాలంలో 43వేల కోట్లకుపైగా ఆదాయానికి మించిన అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోపణల‌తో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయన క్విడ్ ప్రోకో పద్ధతిలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి నుంచి  త‌న‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించార‌ని ఆరోపణలపై న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. 14ఏళ్లుగా ఈ కేసులు కోర్టుల్లో విచార‌ణ జ‌రుగుతున్నాయి. ఈ కేసుల నేప‌థ్యంలో 2012లో ఆయ‌న అరెస్ట్ అయ్యారు. ఆ స‌మ‌యంలో ప‌ద‌హారు నెల‌లు జైలులో శిక్ష అనుభ‌వించి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి ఆయన బెయిల్ పైనే ఉన్నారు. జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌స్తుతం 52ఏళ్లు. ఇప్ప‌టికే ఈ కేసుల విచార‌ణ‌లో 14ఏళ్లుగా సాగుతోంది. ఆ కేసుల విచారణ వేగం చూస్తుంటే మరో దశాబ్దం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   అప్ప‌టికీ ఆయ‌న వ‌య‌స్సు అర‌వైయేళ్లు దాటుతుంది. ముఖ్య‌మైన కేసుల విచారణ కూడా నత్తనడకతో పోటీ పడుతుండటం వల్ల  స‌రైన స‌మ‌యంలో నిందితుల‌కు శిక్ష‌లు ప‌డ‌టం లేదు. జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న సూక్తి రాజకీయనాయకులకు వర్తించదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ కేసుల విచారణ పూర్తి కావడానికి ఏళ్లూ పూళ్లు పడుతుండటంలో నేతలలో శిక్ష పడుతుందన్న భయం కనిపించడం లేదు. దీని వల్ల   మిగిలిన వారిలోనూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల పట్ల భయం, గౌరవం లేకుండా పోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.  రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్ర‌మ‌ సంపాదనకు పాల్పడాలంటే భయపడేలా న్యాయ‌స్థానం వేగంగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మెజారిటీ ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు.  

-భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి 
న్యాయవాదవిద్యార్థి. అమెరికా.

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.