Publish Date:Nov 30, 2024
వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో తిరుమల కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయ ప్రసంగాల నుంచి, రాజకీయ ప్రదర్శనలు, స్టిక్కర్ల ప్రదర్శనలకు తిరుమల వేదికగా మారింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా యథేచ్చగా సాగింది. తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు.
ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమలలో అవినీతి అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ హయాంలో ఎంత జరగాలో అంతా జరిగింది. చివరికి శ్రీవారి ఆదాయానికి కూడా వైసీపీయులు శఠగోపం పెట్టేశారు. టీటీడీ చైర్మన్లుగా సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ఉన్న సమయంలో ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధుల వ్యయంలో గోల్ మాల్ జరిగిందని తేలింది. అలాగే ముడి సరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలకు లెక్కే లేదు. మొత్తంగా జగన్ అధికారంలో ఉన్న కాలంలో శ్రీవారి ఖజానాకు 500 కోట్ల రూపాయలకు పైగా గండి పడిందని విజిలెన్స్ తేల్చింది.
వీటన్నిటికీ మించి తిరుమల కొండను వైసీపీయులు తమ రాజకీయ ప్రసంగాలు, ప్రచారాలకు వేదికగా చేసేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అధికారం కోల్పోయిన తరవాత కూడా వైసీపీయులు తిరుమల వేదికగా రాజకీయ ప్రసంగాలు చేయడంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలి బోర్డు సమావేశంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించాలని తీర్మానించింది. ఇప్పుడు ఆ తీర్మానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-speaches-bannad-in-tirumala-25-189255.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.