కేసీఆర్‌తో యాద‌వుల మంత‌నాలు అందుకేనా? అఖిలేష్ కోసం మ‌జ్లిస్‌తో స్కెచ్?

Publish Date:Jan 12, 2022

Advertisement

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ ఆయనకు అతిధి మర్యాదలు చేశారు. విందు ఇచ్చారు. ఇద్దరు నాయకులు జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. అయితే, తేజస్వి  హైదరబాద్ ఎందుకు వచ్చారు? గత వారంలో  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతా రామ్ ఏచూరి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వచ్చినట్లుగా, ఈయన కూడా తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారా ? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు మర్యాద పూర్వకంగా విందు ఇచ్చారా లేక  వ్యక్తి గత పని మీద హైదరాబాద్ వచ్చిన తేజస్వీ యాదవ్ మర్యాద పూర్వకంగా కేసీఆర్ ‘ను కలిశారా?అంటే అలాంటిది ఏమీ లేదు. గతంలో అఖిలేష్ యాదవ్ వచ్చి వెళ్ళినట్లుగానే, ఒక విధంగా ఆయన పర్యటనకు కొనసాగింపుగానే తేజస్వీ యాదవ్ హైదరాబాద్ వచ్చి వెళ్ళారని సమాచారం. 

అంతే కానీ అలాగే, ఆయన హైదరాబాద్ ఎలా ఉందో,ఎంత అభివృద్ధి అయిందో చూసి పోదామని రాలేదు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, బీహార్ యాదవ నేత తేజస్వీ యాదవ్, యూపీ యాదవ నాయకుడు అఖిలేష్ యాదవ్ దూతగానే హైదరాబాద్ వచ్చి, కేసీఆర్ ‘ను కలిశారు. రాష్ట్రంలో తెరాస, ఎంఐఎం పార్టీలు మిత్ర పక్షాలు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం గురించి వేరే చెప్పనక్కర లేదు. అవసరార్ధం అప్పుడప్పుడు వారూ వీరూ కొట్టుకున్నా, తిట్టుకున్నా ‘ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ముఖ్యమంత్రి కేసేఆర్ అనేక సందర్భాలలో చెప్పారు. 

అయితే,ఇదే అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, అఖిలేష్ యాదవ్ విజయావకాశాలను, గట్టిగా దెబ్బతీస్తున్నారు. ఆయనకు కనిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ విస్తరణ పేరిట ఒవైసీ, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్ధులు పోటీకి దించుతున్నారు. గతంలోనూ ఒవైసీ, యూపీతో పాటుగా, మహారాష్ట్ర, బెంగాల్, ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా ఎంఐఎం అభ్యర్ధులను నిలపెట్టారు.ఆ విధంగా బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటును చీల్చి, బీజేపీ గెలుపుకు సహకరించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీతో ఒవైసీకి లోపాయికారి ఒప్పందం ఉందని, లౌకిక వాద పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో.2019 లోక్ సభ ఎన్నికల్లోనూ కూడా ఒవైసీ, యూపీలో తమ అభ్యర్ధులను నిలిపారు. బీజేపీ గెలుపుకు సహక్రించారు. అయితే, ఈ సారి, ఆయన ఇతర స్థానిక పార్టీలతో కలిసి, అన్ని స్థానాల్లో పోటీకి దిగడమే కాకుండా, కేవలం ముస్లిం ఓటునే కాకుండా బీసీ, ఓబీసీ, దళిత,బహుజన ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారం సాగిస్తున్నారు. 

ఈ నేపధ్యంలోనే ఎంఐఎంను బరిలోంచి తప్పించి లేడా పరిమితంగా పోటీలో నిలిచేలా ఒప్పించే బాధ్యతను అఖిలేష్, కేసీఆర్’ కు అప్పగించారు. ఆ కార్యం మీదనే తేజస్వీ యాదావ్, అఖిలేష్ దూతగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్’తో మంతనాలు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  పనిలో పనిగా అన్నో ఇన్నో కోట్ల రూపాయల సహాయం కూడా, తేజస్వి ప్రత్యేక విమానంలో పట్టుకు పోయారని కొందరు  అంటున్నారు కానీ, డబ్బులకంటే కూడా ఒవైసీతో సంధి కోసమే తేజస్వీ యాదవ్, చార్టెడ్ ఫ్లైట్’లో హైదరాబద్ వచ్చి పోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.