Publish Date:Jul 13, 2022
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో వివాదంగా మారింది. అధికార వైసీపీ మద్దతును తమ పార్టీ కోరలేదంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి షెకావత్ తోసిపుచ్చారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సరే అదలా ఉంచితే.. సత్యకుమార్ వ్యవహారం సద్దుమణగక ముందే.. కేంద్ర మంత్రి మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ముర్ముకు ప్రచార బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీడీపీ మద్దతు స్వచ్ఛందమే నంటూ చేసిన వ్యాఖ్యలు కూడా.. టీడీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న అభిప్రాయం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. సత్యకుమార్ వ్యాఖ్యలు ఖండించిన షెకావత్, ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేసిన కిషన్‌రెడ్డి విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. తనను గెలిపించాని కోరేందుకు ఏపీకి వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు ఏపీలో ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయనడంలో సందేహం లేదు. . అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ ఓట్లన్నీ ముర్ముకేనన్నది స్పష్టమైపోయింది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ముర్ముకే మద్దతు పలికారు. అయితే బీజేపీకి మాత్రం ఏపీకి సంబంధించినంత వరకూ ఇద్దరు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా పరిణమించాయి. వైసీపీ మద్దతు తాము కోరలేదని, తమ దృష్టిలో అది అంటరాని పార్టీనే అంటూ బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించగా, కేంద్రమంత్రి షెకావత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాము జగన్‌తో మాట్లాడి మద్దతు కోరామని షెకావత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
నిజంగా బీజేపీ వైసీపీ మద్దతు కోరినా, కోరకపోయినా.. ముర్మును గెలిపించేందుకు వేసిన కమిటీకి కన్వీనర్ అయిన షెకావత్ తన పెద్దరికం నిలబెట్టుకున్నారు. ఆ వివాదానికి తెరపడిందని ఊపిరి పీల్చుకునే లోగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మ టీడీపీ స్వచ్ఛందంగా మద్దతునిచ్చిందంటూ వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. నిజానికి టీడీపీ నిజానికి ముర్ము పర్యటనకు ఒకరోజు ముందు మాత్రమే టీడీపీ ఆమెకు మద్దతు ప్రకటించింది. సరే దాని సంగతి పక్కన పెడితే.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత.. సోషల్ మీడియాలో టీడీపీపై, వైసీపీ ట్రోలింగ్ మొదలయింది.
టీడీపీ తనను కోరకుండానే బీజేపీకి మద్దతు నిచ్చిందని కొందరు, బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ తెగ పాకులాడుతోందని అర్ధం వచ్చేలా మరి కొందరు సామాజిక మాధ్యమంలో తెలుగుదేశంపై విమర్శలు, సెటైర్లు వేశారు. అయితే వాస్తవంగా టీడీపీ మద్దతు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం ఉదయమే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే కిషన్ రెడ్డి టీడీపీ మద్దతు స్వచ్ఛందమే అంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా బీజేపీని డిఫెన్స్ లో పడేశాయి. సజావుగా సాగిపోవాల్సిన ముర్ము పర్యటనను రాజకీయాల్లోకి లాగినట్లైంది. ఇప్పుడు టీడీపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే షెకావత్ ఏం చెబుతారు. వైసీపీ విషయంలో సత్య కుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అన్నట్లుగానే కిషన్ రెడ్డి విషయంలోనూ అనగలరా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-marks-in-murmu-ap-tour-25-139608.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.