ముద్రగడ కాపు కాస్తారనేనా?!

Publish Date:Jun 9, 2022

Advertisement

అధికార వైసీపీ నుంచి ఇటీవల  సస్పెన్షన్ కు గురైన కొత్తపల్లి సుబ్బారాయుడితో  కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ.. నర్సాపురంలోని కొత్తపల్లి నివాసానికి చేరుకుని.. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అయితే వీరి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే అంశాలపై  ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. 

ఈ భేటీ అనంతరం ముద్రగడ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన  నాటి నుంచి.. ఇటీవల వరకు ముద్రగడ యమా సైలెన్స్  పాటిస్తూ వచ్చారు.  ఇక జిల్లాల విభజనకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లాను విభజిస్తే... ఓ జిల్లాకు బి.ఆర్ అంబేద్కర్, మరో జిల్లాలకు బాలయోగి పేర్లు పెట్టాలంటూ సీఎం వైయస్ జగన్‌కు నేరుగా ఆయన బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే అమలాపురం కేంద్రంగా కొనసీమ జిల్లా ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు వరకు కొత్త పల్లి, ముద్రగడల  మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాల విభజన మొదలు.. బ్రిటిష్ కాలం నుంచి రెవిన్యూ డివిజన్ ఉన్న నరాసాపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం...అలాగే రెవిన్యూ డివిజనే లేని భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం.. జిల్లా విభజన క్రమంలో ఎవరినీ సంప్రదించక పోవడం.. అలాగే నరాసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని..  ఎమ్మెల్యేగా ఎం ప్రసాదరాజును గెలిపించడం కోసం తాను, తన సోదరుడు కొత్తపల్లి జానకీరామ్‌ పడిన కష్టం.. అన్నీ  పూసగుచ్చినట్లు కొత్తపల్లి ముద్రగడకు వివరించినట్లు చెబుతున్నారు.   అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోవడమే కాకుండా..  అయిదుసార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ పదవులలో సేవలందించి రాణించిన  తన లాంటి సీనియర్‌ను   జగన్ పక్కన పెట్టడం పట్ల కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ రఘు రామకృష్ణంరాజు జగన్ నుఎన్ని తిట్లు తిట్టినా... ఆయనను వదిలేసి.. తనను సస్పెండ్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ముద్రగడ ముందు కొత్త పల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా.. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం పట్ల నరసాపురం ప్రాంత ప్రజలు.. జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ముద్రగడకు కొత్తపల్లి వివరించినట్లు తెలుస్తోంది. 

అదీకాక.. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లితో భేటీ కావడం.. ఆ క్రమంలో సుదీర్ఘ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో ఉత్కంఠ, ఆసక్తి రేకెత్తించింది. 
 

By
en-us Political News

  
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.