కంటోన్మెంట్ లో రాజకీయ కాక.. అక్కడ నుంచి పోటీకి బీఆర్ఎస్ లో పోటాపోటీ!

Publish Date:Feb 22, 2023

Advertisement

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిన్న మృతి.. అధికారిక లాంఛనాలు లేకుండా ఆయన అంత్యక్రియల వివాదం సద్దుమణగక ముందే బీఆర్ఎస్లో రాజకీయ కాక మొదలైంది. సాయన్న మృతిలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమన్నచర్చ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పార్టీలో పోటీ పెరిగింది. ఇద్దరు మంత్రుల అనుచరులు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు.  ఉప ఎన్నికకు కాకపోయినా.. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోనైనా కంటోన్మెంట్ సీటు దక్కించుకోవాలన్న వ్యూహంతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఎతులు వేస్తున్నారు.

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంలో అక్కడ నుంచి ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక వేళ ఉప ఎన్నిక నిర్వహించడమంటూ జరిగితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.   ఆ అంచనాతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల సన్నిహితులు ప్రయత్నాలు ప్రారంభించేశారు.

మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడైన ఎర్రోళ్ల  ఎర్రోళ్ల శ్రీనివాస్  అలాగే కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే క్రిశాంక్  కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ టికెట్ కోసం తమ వంతు ప్రయత్రాలు చేస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్లుగా ఇదే నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న సాయన్న చేతిలో ఓడిపోయిన గడ్డం నగేష్ సైతం ఇప్పుడు తనకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  2014లో తనపై గెలిచిన సాయన్నకే 2018 ఎన్నికలలో కేసీఆర్ పార్టీ టికెట్ ఇవ్వడంతో.. అప్పుడు త్యాగం చేసిన తనకే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఈ ముగ్గురే కాకుండా సాయన్న కుమార్తె లాస్య కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.  

By
en-us Political News

  
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.