కర్ణాటకలో ఆట మొదలైంది!

Publish Date:Jul 26, 2023

Advertisement

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా వందరోజులు  కూడా కాలేదు  ఇంతలోనే బీజేపీ  ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించింది. గతంలో  కర్ణాటక సహా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చి, గద్దె నెక్కిన కమల దళం, ఇప్పడు కర్ణాటకలో మళ్ళీ అదే కథను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. అవును ఇది ఎవరో, ఏ అనామక నాయకుడో చేసిన చిల్లర ఆరోపణ కాదు. బీజేపీని బద్నాం చేసేందుకు నాడు   రాజకీయ విశ్లేషకులు చేసిన రాజకీయ వ్యాఖ్యానం కాదు. స్వయంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని కూడా డీకే మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ఒక్క డీకేనే కాదు. మరో మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా మరింత స్పష్టంగా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.అదే సమయంలో,పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా ఇంచార్జి మంత్రులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసినట్లు చెపుతున్న నకలీ  లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీకే ఆరోపణలకు బలం చేకూరిందని అంటున్నారు.  అదే సమయంలో  కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఆది నుంచి ఉన్న విభేదాలు అడ్డు పెట్టుకుని, బీజేపీ కాంగ్రెస్ వేలితోనే కాంగ్రెస్  కంట్లో పొడిచే వ్యూహాలకు పదును పెడుతోందని అంటున్నారు.  

నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం బీజేపీ అగ్ర నాయకత్వానికి తల వొంపులు తెచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని, సర్వం తానై విస్తృతంగా ప్రచారం చేసినా, అమిత్ షా నాయకత్వంలో కేంద్ర నాయకత్వం మొత్తానికి మొత్తంగా కర్ణాటకలో తిష్ట వేసి చక్రం తిప్పినా బీజేపీ ఓటమి పాలు కావడం కమల దళానికి మింగుడు పడలేదు. అందుకే, ఆలస్యం చేయకుండా అర్జెంటుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైందనే అనుమానాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. 

ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేయడంతో కమల దళంలో గుబులు మొదలైంది.  ఐదు గ్యారెంటీల విషయంలో సిద్దూ సర్కార్ సక్సెస్ అయితే  ఆ ప్రభావం మరో నాలుగైదు నెలలలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పైనా ఉంటుందని అలాగే ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరగనున్నసార్వత్రిక ఎన్నికల పైనా ఉంటుందని భయపడుతోంది. అందుకే కమల దళం మొగ్గలోనే కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు తొందర పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ సిద్ధరామయ్య  కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికోసం విదేశంలో పథకం రచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమ ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని వెల్లడించారు.

అయితే, బీజేపీ పేరు  ఎత్తకుండా  ఈ కుట్ర చేసేది ఎవరో తమకు తెలుసునని డీకే పరోక్షంగా, కమలం పార్టీని వేలెత్తి చూపించారు. బెంగళూరులో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తే తమ ప్రభుత్వానికి తెలుస్తుందని.. కుట్రకు సింగపూర్‌ ను వేదిక చేశారన్న డీకే.. దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని  పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలోనే డీకే శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుతం ఇలాంటి  కుట్రలకు భయడదని డీకే ధీమా వ్యక్తం చేశారు. ఒక  విధంగా చేతనైతే, సిద్దు సర్కార్ ను కూల్చాలని కమల దళానికి సవాలు విసిరారు. 

అలాగే రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర బీజేపీకి ఉందని ఆరోపించారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. బీజేపీ కుట్రలను వమ్ము చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల చేత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అన్న ఆయన అందుకే, గతంలో లాగ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా ముందు నుంచే జాగ్రత్త అవసరమన్నారు.  అయితే, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అంతర్గత సంక్షోభం ఏర్పడితే తప్ప సిద్దరామయ్య ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పులేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.