కొత్త జాతీయ చిహ్నంపై రాజకీయ రగడ
Publish Date:Jul 14, 2022
Advertisement
కొత్త ఇల్లు కట్టుకున్నవారికి పాత ఇల్లు నచ్చదు, కొత్త సొబగులతో ఇంటి రూపు మార్చినవారికి పాత ఇంటి ప్రత్యేకతలతో పోల్చు కోవడం ససెమీరా నచ్చదు. కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన కొత్త జాతీయచిహ్నం పై ఇపుడు రాజకీయ రచ్చ పెచ్చు మీరుతోంది. బిజెపికి తమకున్నంత దేశభక్తి దేశంలో మరెవ్వరికీ ఉండదన్న గట్టి నమ్మకం. విపక్షాలకు మాత్రం కమలనాధుల దేశభక్తి కేవలం కాషాయపర మైనది. తాము చేసిన ప్రతీ పని దేశభక్తితో చేస్తున్నట్టు మోదీ ప్రభుత్వం భజన చేయించుకోవడం బాగా అలవాటయింది. అందువల్ల విపక్షాలు చిన్న విమర్శచేసినా తిట్టిపోయడానికి వేయి గొంతుకలు సిద్ధంగా వుంటాయి. సారనాధ స్తూపం కంటే మేం నిర్మించినదే మహా గొప్ప అని బాకా బజాయించుకుంటున్న తరుణంలో విప క్షాల చిన్నపాటి పోలికను మోదీ సర్కార్ బొత్తిగా సహించలేకపోతోంది. శాంతికి చిహ్నంగా వుండాల్సినవి ప్రజల్ని ఆగ్రహోరుద్రులుగా మార్చేందుకు స్పూర్తినిచ్చేవిగా సింహాలు వున్నాయని దేశం లోని విపక్షాలు, సారనాధ్ స్తూపం ప్రత్యేకత తెలిసినవారూ మండిపడుతున్నారు. జాతీయ చిహ్నం బిజెపి ఆలోచనలకు ప్రతిబింబంలా వుందిగాని అందులో జాతీయత వీసమెత్తయినా లేదన్న ఆరోపణలే బలంగా వినపడుతు న్నాయి. కొత్త పార్లమెంటు భవనం మీద కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం అర్ధం లేనివని కొట్టిపారేస్తోంది. కానీ ఆలోచించి ఆ ఆరోపణల వెనక సారమేమిటన్నది కేంద్రం ప్రభుత్వం రవ్వంతయినా గ్రహించడం లేదు. అది అచ్చం సారనాథ్‌లోని సింహాల చిహ్నంలానే వుంద ని భావించడమే బిజెపి నేతల పొరపాటు కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నారని విపక్షాలు గోల చేస్తున్నా యి. కాగా రెండు నిర్మాణాలను సరి పోలుస్తున్నపుడు వాటి సైజు, ఎత్తుని కూడా లెక్కలోకి తీసుకోవాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పురి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం పైన ఉన్న కాంస్య జాతీయ చిహ్నం పరిపూర్ణ ప్రతిరూపం అని ఆయన అన్నా రు. ఎత్తు, రంగు కాదు.. అసలు ఆ చిహ్నం తెలియజేసే జాతీయతను తారుమారు చేస్తున్నారని చరిత్ర కారులూ ఘాటుగా విమర్శిస్తున్నారు. తాము చేపట్టినవన్నీ శాస్త్రప్రకారమే చేస్తున్నామని భజన చేయించు కోవడం బిజెపి నేతలు కాస్తంత తగ్గించుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, సూచించినా తమ పంథాను మార్చు కోకుండా ఈ విధంగా జాతీయతను అపహాస్యం చేయడానికే బిజెపి కంకణం కట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త చిహ్నం 33 మీటర్ల ఎత్తులో వుందని , అసలు సారనాథ్ చిహ్నం 1.6 మీటర్ల ఎత్తు ఉండగా, కొత్త పార్లమెంట్ భవనం పైభాగంలో ఉన్న కాంస్య చిహ్నం 6.5 మీటర్ల ఎత్తులో భారీగా ఉందని కేంద్ర మంత్రి హర్‌దీప్ అన్నారు. అసలు సారనాథ్ చిహ్నం కేవలం 1.6 మీటర్ల ఎత్తు ఉంటుం దని, కొత్త పార్ల మెంటు భవనం పైభాగంలో ఉన్న చిహ్నం భారీగా . 6.5 మీటర్ల ఎత్తులో ఉందని అని మంత్రి చెప్పారు. ఒక శిల్పా న్ని, బొమ్మని చూసినపుడు దాని అందం, గాంభీర్యం అనేది చూసేవారి దృష్టిమీద ఆధారపడి వుంటుం దని, ఈ కొత్త భవనంపై ఏర్పాటు చేసిన కాంస్య చిహ్నాన్ని విపక్షాలు విమర్శించడంలోనే వారి దృష్టి తెలు స్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విమర్శలు, ప్రభుత్వ వివరణలో వక్రీకరిం చిందన్న విమర్శలకు మంత్రి ప్రతిస్పందించారు. కానీ హిందూత్వభావనలో కొట్టుకుపోతున్న పార్టీవారు కనీసం సారనాధ్ స్తూపానికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడంలేదన్నది వారి అత్యాధునిక ఆలోచన స్పష్టం చేస్తున్నదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలు వివాదమేమంటే, కొత్త పార్లమెంటు భవనం పై ఏర్పాటుచేసిన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాల కోరలు కనపడుతున్నాయని, సింహాలు రౌద్రంగా వున్నాయని, అసలు ఈ చిహ్నం అశోకుని రాజధాని సారనాధ్‌లోని చిహ్నం వలెనే వుందని ప్రభుత్వం ప్రచారం చేయడంతో విపక్షాలు మండిపడు తున్నాయి. అయితే భారత పురావస్తుశాఖ మాజీ అధికారి బి.ఆర్ మణి మాత్రం సార నాధ్‌లోని అసలు స్తంభం 7 నుంచి 8 అడుగుల ఎత్తు వుండగా, ఈ కొత్త జాతీయ చిహ్నం అంతకంటే మూడు రెట్లు ఎత్తు వుందన్నారు. అయితే దీన్ని మరీ రాజకీయపరంగా వివాదం చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/political-furore-over-new-emblem-25-139704.html





