పొలిటికల్ కామెడీ స్టార్ పాల్ ఫైర్స్ ఎగైన్.. నిన్నకేటీఆర్, కేసీఆర్..నేడు చంద్రబాబు, పవన్..

Publish Date:May 8, 2022

Advertisement

రాజకీయాలలో నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు హీట్ పెంచుతాయి. ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఆవేశ, కావేషాలను పెంచుతాయి. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ విమర్శలతో హాస్యాన్ని పెంచే నాయకుడు ఒకే ఒక్కడు ఉన్నారు. ఆయన పేరు కే.ఏ.పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు. సాధారణంగా ఆయన సీన్ మీదకు రారు. ఎన్నికలు వస్తే కానీ కనిపించరు. కానీ ఎన్నికల వాతావరణం కనిపించిందంటే ఆయన విమర్శలతో రెచ్చిపోతారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఇండియా ప్రధాని దాకా, బిల్ గేట్స్ నుంచి ముఖేష్ అంబానీ వరకూ అందరూ తన సలహాలూ, సూచనలూ, బోధనలతో  బాగుపడిన వారే అని చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పార్టీల మీదా, నేతల మీదా ఒంటి కాలి మీద లేచి మరీ విమర్శలు గుప్పిస్తారు. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడగా ఎవరూ విన్నది లేదు. కానీ వీళ్ల వల్లే దేశం నాశనమైంది... అదే నేనైతేనా అంటూ నేల విడిచి సాము చేస్తారు. 

2014 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో కే.ఏ. పాల్ చేసిన హడావుడీ, పంచిన హాస్యం అందరికీ ఇప్పటికీ గుర్తుంది. మొత్తం 175 స్థానాలలోనూ పోటీ చేస్తానంటూ ఆయన చేసిన హంగామా, చివరికి సోదిలోకే లేకుండా అసలు పోటీయే చేయకుండా తప్పుకున్న కామెడీ ఎవరికీ మరపురాదు. ఆ తరువాత ఆయన రాజకీయ ఎరీనాపై మళ్లీ ఇటీవలే కనిపిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘ముందస్తు’ అంచనాల నేపథ్యంలో ఆయన మళ్లీ రంగంలోనికి వచ్చారు. నిన్న మొన్నటి వరకూ తెరాస అధినేత కేఏ పాల్ పైనా, ఆయన కుమారుడు, మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైనా విమర్శలతో చెడుగుడు ఆడుకున్న ఆయన.. ఇప్పుడు ఏపీపై పడ్డారు. చంద్రబాబు వల్ల ఏకంగా దేశం నాశనమైపోయిందన్నారు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నారు.

ఆయన మాటలు కోటలు దాటుతాయి. ప్రజాశాంతి పార్టీలో పాల్ కాకుండా ఇంకా ఉన్న నేతలెవరో? అసలా పార్టీకి కార్యకర్తలు ఉన్నారా? పార్టీ కమిటీలు ఉన్నాయా? నిర్మాణం ఉందా వంటి ప్రశ్నలు ఎవరికీ రావు. అవి అవసరమని పాల్ అనుకోరు. వన్ మేన్ ఆర్మీలా, పాల్ ది వన్ మేన్ పార్టీ. ఆయన విమర్శలు, వ్యాఖ్యలు, విన్యాసాలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కామెడీ పండుతుందని ఎలక్ట్రానిక్ మీడియా ఆయన ప్రసంగాలను టెలికాస్ట్ చేస్తుంది.    మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయనీ, పార్టీల మధ్య హీట్ థార్ ఎడారిని మించి ఉంటుందనీ అంచనాలున్న నేపథ్యంలో కేఏ పాల్ ఎంట్రీ అటు నేతలకూ, ఇటు ప్రజలకూ కొంత వినోదాన్ని పంచడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.