సమస్యఒదిలేసి వైసీపీ సర్కస్ ఫీట్లు! టెన్త్ ఫలితాలపై పొలిటికల్ బ్లేమ్ గేమ్

Publish Date:Jun 8, 2022

Advertisement

స్కూళ్లలో పాఠాలు చెప్పనివ్వకుండా మరుగుదొడ్లు ఫోటోలు తీసే పనికి టీచర్లను పెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఉపాధ్యాయులను సారా దుకాణాల వద్ద కాపలాకి పంపిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. టీచర్లను మానసికంగా వేధిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాఠాలు బోధించేవారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసేలా సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.

స్కూళ్లలో దామాషా ప్రకారం మాస్టార్లను నియమించకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? పైసలిస్తే ఫలితాలు రావు. మౌలిక సదుపాయాలు ఇచ్చినంత మాత్రాన ఫలితాలు మెరుగు పడవు.

ప్రాథమిక విద్యలో ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని వేయండి ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. హైస్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. ఇకనైనా మారండి. మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి’ ఏపీలోని ఓ సగటు ఉపాధ్యాయుడు ఆవేదనతో అన్న మాటలివి. 

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సుమారు రెండు లక్షల మంది ఫెయిలవడం, పాస్ శాతం 67.26 శాతానికి పడిపోవడం, 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాని సందర్భంలో ఆ సగటు టీచర్ లో పెల్లుబుకిన ఆవేదన ఇది.ఈ ఏడాది టెన్త్ పాస్ శాతం దారుణంగా తగ్గిపోవడానికి కరోనా కారణమని కొందరు, ప్రభుత్వ వైఫల్యమే అని మరికొందరు, ప్రశ్నాపత్రాలు లీకవడం అని ఇంకొందరు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడమూ కారణమే అని కొందరు, స్కూళ్లలో టీచర్లే లేపోవడం అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.  అధికార, విపక్షాలైతే బ్లేమ్ గేమ్ కు దిగారు.  కరోనా వల్ల రెండేళ్లు పరీక్షలు లేకపోవడం, ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేక విద్యార్థులకు  ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించడం, నారాయణ విద్యాసంస్థలో ప్రశ్నాపత్రాలు ముందే లీకవడం లాంటి కారణాలను వైసీపీ సర్కార్ సాకుగా చూపిస్తోంది.  ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కరోనా వల్ల వారి 8 ,9 తరగతుల్లో పరీక్షలు నిర్వహించలేదని, అప్పుడు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయడం కారణమే అని చెబుతోంది. ఆన్ లైన్ క్లాసులు విన్నట్లు కొందరు విద్యార్థులు నటిస్తూ, ఫోన్ లలో ఇతర వీడియోలు చూడడం వల్లే ఉత్తీర్ణత తగ్గడానికి కారణం అని చెప్పుకొస్తోంది.

నాడు- నేడు నెపంతో వైసీపీ సర్కార్ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రచారం చేసుకుందని, తమ హయాంలో 90 నుంచి 95 శాతం వరకు టెన్త్ పరీక్షా ఫలితాలు రాబట్టామని.. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి తీరుతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే దుస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. పరీక్షల్లో ఫెయిల్ అయింది విద్యార్థులు కాదని, ప్రభుత్వ వ్యవస్థలే అనేది ఆయన ఆరోపణ.

విద్యా వ్యవస్థను వైసీపీ సర్కార్ సర్వనాశనం చేసిందని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టెన్త్ ఫలితాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ‘ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు.. జగన్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఫెయిల్ చేయడం ద్వారా అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను దూరం చేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపణ. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తో ఆభాసు పాలైందని విమర్శించారు. నాడు- నేడు పేరుతో 3 వేల 500 కోట్లు మింగేసిన వైసీపీ సర్కార్, డీఎస్సీ నిర్వహించలేదని, టీచర్లను నియమించలేదని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. అందుకు ‘నారాయణ’ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారమే కారణం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేయడం గమనార్హం. చదువు‘కొన్న’వాడివి నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడడమేంటని వ్యక్తిగత విమర్శలకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా రంగంలోకి వచ్చి.. ‘చదువంటే ఇసుక తోడడం కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి.. పాఠశాల గోడలకు రంగువేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం కాదు’ అంటూ జగన్ సర్కార్ ను ఎద్దేవా చేశారు. 71 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణతా శాతాన్ని చూసి సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని తూర్పారపట్టారు. భారీ సంఖ్యలో టెన్త్ విద్యార్థులు పెయిలవడానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణమని టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి భారం తగ్గించుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించిందనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 97 శాతం ఉత్తీర్ణత వస్తే.. వైసీపీ పాలనలో 67 శాతానికి పడిపోవడంపై ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. ప్రకటించిన దానికన్నా రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని నిందించారు. ఇంగ్లీష్ మీడియంపై మోజుతో మాతృభాషను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంవల్ల కూడా విద్యార్థులకు భారీ నష్టం కలిగిందని విశ్లేషించారు.

ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకు వచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవని సెలవిచ్చారు. పరీక్షా ఫలితాలపై కోవిడ్ ప్రభావం పడిందట. ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని విపక్షాలు వేలెత్తి చూపించకూడదంటున్నారు. దీన్ని విపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని ఉపన్యాసం ఇచ్చారు. పైగా టెన్త్ ఫలితాలపై విపక్షాలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అసలు టీడీపీ హయాంలో మాదిరిగా పరీక్షల్లో అక్రమాలు జరగకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందని, అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గిందని విశ్లేషించారు. కాపీ కొట్టేందుకు వీలుండే బిట్ పేపర్ తీసేయడం కూడా పాస్ శాతం తగ్గడానికి ఒక కారణం అంటున్నారు. అంటే నిఖార్సయిన వారు, నిజాయితిగా పరీక్షలు రాసిన వారే పాస్ అవడం తమ విజయం అని చెప్పుకొచ్చారు.

పరీక్ష ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోతే.. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారి భవిష్యత్తును మెరుగు పరిచేందుకు ఏం చేయాలో, ఎలా చక్కదిద్దాలొ ఆలోచించకుండా అధికార, విపక్షాల నేతలు ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.