ఏపీలో భారీ పోలింగ్.. దెబ్బపడిందెవరికో తెలుసా?

Publish Date:May 14, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంద ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి  వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారూ, ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు పది లక్షల మంది ఏపీకి వచ్చి తమతమ స్వగ్రామాలలో  ఓటు హక్కు వినియోగించుకున్నారంటే రాష్ట్రం పట్ల వారెంత అక్కరతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి పని గట్టుకు మరీ వచ్చి ఓటు వేసిన వారిలో 98 శాతం మంది కూటమికే ఓటు వేశారని మీడియా పేర్కొంది. పరిశీలకులు విశ్లేషించారు.  అసలు అన్ని లక్షలమంది  ఓటు వేయడానికి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తితో, పట్టుదలతో తమ స్వరాష్ట్రం ఆంధ్రకు ఎందుకు తరలివచ్చారు. జరుగుతున్నది సార్వత్రిక ఎన్నికలు. ఏపీలో అసెంబ్లీకి కూడా జరిగాయనుకోండి అది వేరే విషయం. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు అక్కడ కూడా ఓటు హక్కు ఉంది. రెండు చోట్ల ఓటు ఉండటం కరెక్ట్ కాదు. అయినా అలా ఓటు ఉన్న వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు.  ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ స్థిరపడిన ఆంధ్రులు అక్కడే ఓటు వేయచ్చు. కానీ హైదరాబాద్‌లో, లేదో తెలంగాణలో మరో చోట ఓటు ఉన్న వాళ్లు  అక్కడ ఓటు వేయకుండా.. ఎండను, రద్దీని లెకక్క చేయకుండా  వ్యయప్రయాసలకోర్చి  ఏపీ వచ్చి మరీ ఓటు వేశారంటే ఏమనుకోవాలి.  

జగన్ ఐదేళ్ల పాలనలో  సంక్షేమం పేరిట పప్పు బెల్లాలకు సరిపోయేలా సొమ్ముల పందేరం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగాలు లేవు. వ్యవసాయం పడకేసింది.   నిర్మాణరంగం నిర్వీర్యమైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దీంతో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇంకా  దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరుకు, కన్నవారికీ దూరమై ఎవరి స్థాయిలో వారు ఉద్యోగాలో, ఉపాధో  వెతుక్కుంటూ వెళ్లిపోయారు.   దీంతో  రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికాబివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో కష్టమైనా, భరించలేని వ్యయం అయినా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి అన్న ఒకే ఒక్క ఆశయంతో, ఆకాంక్షతో, సంకల్పంతో  ఇన్ని లక్షల మంది   ఆంధ్రాకు తరలి వచ్చి మరీ ఓటు వేశారు.  ఇంత చెప్పుకున్న తరువాత కూడా ఏపీలో ఓట్ల వెల్లువతో ఎవరికి దెబ్బపడిందన్నది ప్రత్యేకంగా చెప్పాలా?

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.