విజయమ్మ, షర్మిలకు పోలీసుల వార్నింగ్!

Publish Date:Apr 26, 2023

Advertisement

కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా  పోలీసు.. పోలీసు... అంటూ పోలీస్ స్టోరీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ చెప్పే డైలాగులో.. పోలీసుల్లోని అంకితభావం, వారిలో ప్రజల కోసం శ్రమించే తత్వం, నీతి నిజాయితీ, అలాగే అవసరమైతే ప్రజల రక్షణ కోసం ఆత్మార్పణకు సైతం  వెనకడుగు వేయని ధైర్య సాహసాలు..తదితర అర్థాలు ప్రతిధ్వనిస్తాయి. అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులతోపాటు... సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించే క్రమంలో సదరు పోలీసులపై విమర్శలు సైతం  వెల్లువెత్తుతుండడమే కాకుండా.. వారిపై దాడులకు సైతం తెగబడుతుండడం ఓ విపరీత పరిణామం అని చెప్పవచ్చు. 

ఇక హైదరాబాద్ మహానగరంలో పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము కిందే లెక్క. విధి నిర్వహణలో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఉంటున్నాయి. అయితే విధుల్లో ఉన్న పోలీసులపై  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, అలాగే ఆమె తల్లి వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ.. దాడి చేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

అయితే ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు  అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి స్పందించారు. ఎంతో బాధ్యతాయుతంగా.. శాంతి భద్రతలల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలతో  పోలీసుల్లో ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు.   విజయమ్మ,   షర్మిల చర్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన వారిద్దరికి ఈ సందర్భంగా నల్లా శంకర్ రెడ్డి సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత గుర్తింపు ఉందని ఆయన ఈ సందర్భంగా  గుర్తు చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో కొంత మంది రాజకీయ నాయకులు.. వ్యక్తిగత గుర్తింపు కోసం అందునా గతంలో ఎంతో బాధ్యతాయుత పదవులు నిర్వర్తించిన వారు కూడా వ్యక్తిగత ప్రాచుర్యం కోసం ఇలాంటి చౌకబారు చర్యలతో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

  షర్మిల సోమవారం సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత.. టీ సేవ్ నిరాహారధీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి మద్దతు కోరాలని   నిర్ణయించారు. అందులోభాగంగా ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు బారీ ఎత్తున మోహరించి.. ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారిపై వైయస్ షర్మిల చెయ్యి చేసుకున్నారు. అనంతరం ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసు స్టేషన్‌లో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు ఆమె తల్లి   విజయమ్మ వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా పోలీసులపై చెయ్యి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పట్ల  షర్మిల, వైయస్ విజయమ్మ వ్యవహరించిన తీరుపై పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.