Publish Date:May 23, 2022
వ్యక్తిగత విషయాలలో అతి జోక్యం కారణంగా నా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను నేనే చంపేశాను మొర్రో అని వైసీపీ అనంతబాబు నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నా పోలీసులు నమ్మడం లేదు. సరికదా ఆయనపై ఎక్కడ లేని సానుభూతీ చూపుతూ ఆయనకు అనుకూలంగా కథలల్లేస్తున్నారు. హత్య కేసు నుంచి అనంతబాబును తప్పించేందుకు నానా తంటాలూ పడుతున్నారు. ఒక వైపు మంత్రి బొత్స సత్యనారాయణ అనంతబాబు విషయంపై మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తనదైన ఉత్తరాది యాసలో యమ సీరియస్ గా చెప్పేశారు. కానీ పార్టీ పరంగా ఆయనపై చర్యలేమిటన్నప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.
దానికి ఇంకా టైముంది. అన్ని అంశాలూ పరిశీలించాలి అంటూ ముక్తాయించేశారు. ఆయన మాటలకు ఎమ్మెల్సీ అనంతబాబును ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలని పోలీసులు అల్లుతున్న కథనాలకూ బేరీజు వేసి చూస్తే అనంతబాబును హత్య కేసు నుంచి తప్పించేందుకు ‘పై స్థాయి’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ వర్గాలలో ఓ చర్చ జరుగుతోంది.
అసలు ఎమ్మెల్సీపై హత్య కేసే లేకుండా చేయడానికి ప్రయత్నించి తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. సంఘటన జరిగిన తరువాత అనంతబాబుపై హతుడి కుటుంబ సభ్యులు స్పష్టమైన ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోస్టు మార్టం నివేదిక రావాలనీ, అంతనబాబు పరారీలో ఉన్నాడనీ అరెస్టు చేయకుండా తాత్సారం చేసి ఎమ్మెల్సీకి హతుడి కుటుంబ సభ్యులను బెదరించో, బతిమాలో వారి నోటితోనే ప్రమాదం అని చెప్పించేందుకు కావలసినంత సమయం ఇచ్చారు. ఆ ప్రయత్నాలను కూడా అనంత బాబు చేశారు. కానీ అవన్నీ విఫలం అవ్వడంతో గత్యంతరం లేక పోలీసులు అనంతబాబుపై కేసు నమోదు చేశారని విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు కూడా అనంతబాబుపై ఎక్కడ లేని సానుభూతి ఒలకబోస్తా ఉన్నారు.
ఆయన ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అంటూ కేసులో సీరియస్ నెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ. పాతిక వేలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీకి బాకీ ఉన్నాడట. అందుకే ఆయనను తీసుకెళ్లాడట. మధ్యలో వాగ్వాదం జరిగితే ఎమ్మెల్సీ తోసేశాడట. సుబ్రహ్మణ్యం వెళ్లి చువ్వలపై పడటంతో తలకు తీవ్ర గాయమైందట. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడట. ఇదీ పోలీసులు తాజాగ అల్లిన కథనం. శరీరంపై ఇతర గాయాలెందుకయ్యాయంటే.. సుబ్రహ్మణ్యం ప్రమాద వశాత్తూ చువ్వలపై పడి చనిపోవడంతో ఆ కేసు తనమీదకు వస్తుందన్న భయంతో ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నంలో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కర్రతో బాదడంతో అయిన గాయాలని పోలీసులు చెబుతున్నారు. ఇంత చిక్కటి కథ అల్లిన కాకినాడ ఎస్పీ అనంతబాబు ఉద్దేశపూర్వకంగా సుబ్రహ్మణ్యంను హత్య చేయలేదనీ, సుబ్రహ్మణ్యంతో వాగ్వాదం సమయంలో వెనక్కు తోస్తే అతడు యాక్సిడెంటల్ గా ,ఇనుప చువ్వలపై పడి మరణించాడనీ చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-trying-to-save-ananthababu-25-136343.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.