శిక్షణలో సాంకేతికపరిజ్ఞానానికి ప్రాధాన్యతనివ్వాలి.. షా
Publish Date:Jul 20, 2022
Advertisement
పోలీసుల శిక్షణా విధానంలో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. దేశభక్తి, క్రమశిక్షణ, బాధితుల పట్ల సౌమ్యంగా వ్యవహరించడం వీటితో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించు కోవడంలో మెళకువలు పోలీసుల శిక్షణలో భాగంగా ఉండా లని ఆయన అన్నారు. పోలీసు శిక్షణా సంస్థల రివ్యూ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులకు ఈ రోజుల్లో సాంకేతికత, ఆధునిక ఆయుధాల శిక్షణ, వినియోగం తప్పకుండా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్యూటీ పట్ల బాధ్యతాయుతంగా ఉండటం, లక్ష్యాలను సాధించాలన్న పట్టుదల కూడా శిక్షణలో భాగంగా ఉండాలని షా సూచించారు. ప్రధాని మోదీ ఆరంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమం క్రింద పోలీసు కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్, డిఎస్‌పి స్థాయిల వరకూ పోలీసు అధికారుల శిక్షణ కట్టుదిట్టంగా జరగాలని అన్నారు. పోలీసులకు 60 శాతం శిక్షణ అందరికీ సమానంగా ఉండాలని, 40 శాతం మాత్రం ఆయుధాల వినియోగం ఆధారిత ప్రత్యేక శిక్షణ ఉండాలని హోం మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా సవాళ్ల స్వభావానికి సత్వర, ప్రభావంతమైన ప్రతిస్పందనలను అందించడానికి పోలీసు సిబ్బంది సామ ర్థ్యాలను పెంపొందించడానికి సరైన సమయంలో సరైన శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కేంద్ర పోలీసు శిక్షణా సంస్థలచే ప్రదర్శనలు చేపడుతున్నారు. శిక్షణా అవస రాల విశ్లేషణ, శిక్షణ వనరుల ఉత్పాదకత ప్రాముఖ్యతతో సహా శిక్షణా పద్ధతులు అమలుచేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/police-training-should-be-changed-39-140156.html





