Publish Date:May 21, 2022
వైపీపీ నేతల కోసం పోలీసులు న్యాయ సూత్రాలనే మార్చేస్తున్నారా? వారి రక్షణ కోసం ప్రత్యేక రూల్స్ రూపొందించుకున్నారా? అంటే ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ విషయంలో పోలీసుల తీరు చూస్తుంటే ఔననే చెప్పాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను రక్షించడమే లక్ష్యంగా పోలీసులు కొత్త కొత్త రూల్స్ చెబుతున్నారు.
ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంఅనుమానాస్పద మృతి విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు. ఒక వైపు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని చెబుతున్న పోలీసులు కనీసం ఆయనపై కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పోలీసులు పరారీలో ఉన్నారంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం దర్జాగా బహిరంగంగా తిరుగుతున్నారు. రాజవొమ్మంగిలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన పేరు మీద ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. అలాగే ఒక వైపు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతుంటే.. గురువారం రాత్రి రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
అర్ధరాత్రి సుబ్రహ్మణ్యాన్ని తీసుకు వెళ్లి, తెల్లారి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ మృతదేహాన్ని తన కారులోనే తీసుకువచ్చి, మృతుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించేసరికి కారును సైతం వదిలేసి పారిపోయిన ఎమ్మెల్సీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
మరో వైపు పోలీసులు ఎమ్మెల్సీ చెప్పినట్లుగా ఆయన చెప్పిన ప్రాంతంలో ఎలాంటి యాక్సిడెంటూ జరగలేదని స్పష్టం చేస్తూనే, సుబ్రహ్మణ్యం మృతికి కారణం తెలియాలంటే మృతదేహానికి పోస్టు మార్టం జరిగి నివేదిక రావాలని చెబుతున్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే తప్ప ఎలాంటి కేసూ నమోదు చేయలేమంటున్నారు.
అయితే బాధితులు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీయే హత్య చేశాడని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తుంటే కూడా ఎమ్మెల్సీపై కేసు కూడా నమోదు చేయకపోవడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలకేమన్నా ప్రత్యేక రక్షణ కవచం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా కళ్లముందే తిరుగుతున్నా పరారీలో ఉన్నాడంటూ పోలీసులు చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-protecting-mlc-anantha-babu-25-136239.html
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.