Publish Date:Feb 12, 2025
డ్రగ్ పెడలర్ లావణ్య సినీ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండ గానే మరో డ్రగ్ పెడలర్ ఎంటరయ్యారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అప్పగించింది
Publish Date:Feb 12, 2025
సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్న తరువాత.. పొరపాటు ఎక్కడ జరిగింది, ప్రజా విశ్వాసాన్ని ఎందుకు కోల్పోయాం. తిరిగి ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అని ఆలోచిస్తుంది. ఘోర ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటుంది. పార్టీని మళ్లీ గాడిలోకి పెట్టడానికి ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తుంది. కానీ వైసీపీలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.
Publish Date:Feb 12, 2025
చిరంజీవి ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది.
Publish Date:Feb 12, 2025
ఆయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆయన ఆదివారం లక్నోలోని ఎసీపీజీటీలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ బుధవారం (ఫిబ్రవరి 12) తుదిశ్వాస విడిచారు.
Publish Date:Feb 12, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది రెట్లు పెద్దదని బీజేపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ లోక్ సభ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేద్ లో మద్యం కుంభకోణం అంశాన్ని ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11) లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తారు.
Publish Date:Feb 11, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మ మాయం కానుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తన ఫొటోల పిచ్చితో ఇష్టారీతిగా ఎక్కడపడితే అక్కడ తన ఫొటోలను ముద్రించుకున్న జగన్.. ఏకంగా సర్వేరాళ్లపైనా, రైతుల ఆస్తికి సంబంధించిన అధికార పత్రమైన పట్టాదారు పాసు పుస్తకాలపైనా కూడా తన బొమ్మలు వేయించుకున్నారు.
Publish Date:Feb 11, 2025
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ రాంకీ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో రాంకీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఆర్పీఎల్ రెండో సీజన్‌కు సంబంధించి సన్నాహక కార్యక్రమం గచ్చిబౌలిలోని రాడిసన్ లో ఇటీవల జరిగింది.
Publish Date:Feb 11, 2025
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాటికి 45 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు.
Publish Date:Feb 11, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (ఫిబ్రవరి12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
Publish Date:Feb 11, 2025
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. రామరాజ్యం పేరిట వీరరాఘవరెడ్డి రంగరాజన్ నివాసానికి వెళ్లి దాడి చేయడాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇప్పటికే రంగరాజన్ నివాసానికి వచ్చి పరామర్శించారు.
Publish Date:Feb 11, 2025
తమిళనాడు రాజకీయాలలోకి ప్రముఖ హీరో తళపతి విజయ్ ప్రవేశమే ఒక సంచలనం అనుకుంటే.. ఆయన తన పార్టీ తమిళగ వెట్రిక కజగం (టీవీకే)కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకోవడం మరింత సంచలనం సృష్టించింది. దేశంలో పలు పార్టీలను విజయతీరాలకు చేర్చేలా వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయారు.
Publish Date:Feb 11, 2025
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కుందా? ముఖ్యమంత్రి జగన్ ఉచ్చులో జగన్ చిక్కుకున్నారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుమలలడ్డూ ప్రసాదం కల్తీ విషయం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారంటూ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి.
Publish Date:Feb 11, 2025
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించేస్తోంది. పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఒక్క రోజులోనే దాదాపు లక్ష కోళ్లు మరణించిన సంఘటనతో అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్ కు పంపారు.