వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ రూమ‌ర్ల వెనుక పోలీసుల హైడ్రామా!?

Publish Date:Aug 4, 2024

Advertisement

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ పేరు మారుమోగుతోంది. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వంశీ పేరును రోజూ త‌లుచుకుంటారో లేదోకానీ... తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గంట‌ గంట‌కు త‌ల‌చుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్టు అవుతారు?.. చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడా అని  చూస్తున్నారు.

తెలుగుదేశం శ్రేణులు ఇంత‌లా వంశీపై ఆగ్ర‌హంతో ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణమే ఉంది. వైసీపీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కొంద‌రు నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. హ‌ద్దులు దాటి అస‌భ్య‌క‌ర ప‌దజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి ర‌మేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వ‌ల్ల‌భ‌నేని వంశీ ముగ్గురూ తెలుగుదేశం నుంచి వైసీపీకిలోకి వెళ్లిన‌ వారే. అధికార మదంతో చంద్ర‌బాబుపై ఇష్టారీతిలో వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో అవ‌మానించారు. ఇక వ‌ల్ల‌భ‌నేని వంశీ  ఏకంగా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు.. ఏపీ ప్ర‌జలు మొత్తం   వంశీపై ఆగ్ర‌హంతో ఉన్నారు. అంతేకాదు.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌మేయం కూడా ఉంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలో కార్యాల‌యంపై దాడిలో ప్ర‌మేయం ఉన్నవంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో యూసుఫ్ ది కీలక పాత్ర ఉందని  పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కేసులో వంశీ మరో అనుచరుడు రమేశ్ ను అంతకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాల‌యం పై దాడికేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ పైన కేసు న‌మోదు కావ‌డంతో  అత‌నికోసం కూడా పోలీసులు  గాలిస్తున్నారు. వంశీ అమెరికా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయ‌న హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని కొంద‌రు తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేశారనే వార్తలు గుప్పుమ‌న్నాయి. పోలీసులు వంశీని అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కొద్దిసేప‌టికి అరెస్ట చేసింది వంశీని కాదు.. ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడిని పోలీసులు తెలిపారు. వంశీని అరెస్టు చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం పెద్ద‌క‌థే న‌డిచిన‌ట్లు తెలుస్తోంది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడికేసులో విచార‌ణ వేగంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వంశీ ఏ71వ నిందితుడుగా ఉన్నాడు. చాలా మంది ప‌రారీలో ఉన్నారు. వాళ్లు ప‌రార‌వ్వ‌డానికి కొంత మంది వైసీపీ భ‌క్త పోలీసులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు చాలా సీరియ‌స్ అవుతాయి..  మీరు పారిపోండి అంటూ ముందుగానే వైసీపీ భ‌క్త పోలీసులు నిందితులకు సూచించిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వంశీ ప‌రారీలో ఉన్నారు. ఆయన చివ‌రిసారిగా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు క‌నిపించారు. ఓట్ల లెక్కింపు రోజు మూడు నాలుగు రౌండ్ల‌లోనే టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని అర్థ‌మ‌వ్వ‌డంతో.. కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వెళ్లిపోవ‌టం క‌నిపించింది. ఆ త‌రువాత‌ వ‌ల్ల‌భనేని నేరుగా అమెరికాలోని డ‌ల్లాస్ వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు తీరిగ్గా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నామ‌ని పోలీసులు చెబుతుండ‌టం తెలుగుదేశం శ్రేణుల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. 

వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు నాయుడుపైన వైసీపీ కార్య‌క‌ర్త‌లు అంగ‌ళ్ళలో దాడి చేశారు. అయినా, పోలీసులు చంద్ర‌బాబు నాయుడుపైన‌, టీడీపీ నేత‌ల‌పైన కేసులు పెట్టారు. అప్పుడు అన్న‌మ‌య్య జిల్లా ఎస్పీ గంగాధ‌ర్ రావు ఉన్నారు. ఆయ‌న ప్ర‌మేయంతోనే స్థానిక పోలీసులు  చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అలాంటి ఎస్పీల‌ను ప‌క్క‌న పెట్ట‌కుండా చంద్ర‌బాబు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ క్ర‌మంలో గంగాధ‌ర్ రావును కృష్ణా జిల్లా ఎస్పీగా ప్ర‌భుత్వం నియ‌మించింది. గంగాధ‌ర్ రావును కృష్ణా  జిల్లాకు పంపించ‌డంప‌ట్ల తెలుగుదేశం నేతలు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం తెలుగుదేశం కార్యాల‌యం ద‌గ్దం కేసులో వ‌ల్ల‌భ‌నేని అనుచ‌రులు పారిపోవ‌డానికి ఎస్పీ గంగాధ‌ర్ రావు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుగుదేశం నేత‌లు భావిస్తున్నారు.  వంశీని సైతం ముంద‌స్తుగా విదేశాల‌కు పంపించింది కూడా కొంద‌రు వైసీపీ భ‌క్త పోలీసులేన‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. కార్యాల‌యంపై దాడి కేసులో నిందితులు ఎక్క‌డ ఉన్నార‌నే స‌మాచారం ఉన్నా పోలీసులు వారిని అరెస్టు చేయ‌డం లేద‌ని, ఇంకా వైసీపీకి అనుకూలంగానే పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుగుదేశం శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అన్నట్లుగా ఒక‌రిద్ద‌రు వైసీపీ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వంశీని అరెస్టు చేశామ‌ని మీడియాకు లీకులు వెళ్ల‌డానికికూడా పోలీసులే కార‌ణంగా తెలుస్తోంది. త‌ద్వారా గ‌న్న‌వ‌రం కార్యాల‌యంపై దాడికేసులో నిందితుల‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నార‌ని ప్ర‌భుత్వాన్ని, ప్రజలను న‌మ్మించేందుకు కొంద‌రు వైసీపీ భ‌క్త పోలీసులు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణులు  వ్య‌క్తం చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ భ‌క్త పోలీసులు వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు కాకుండా చూడ‌డంకోసం తెర‌వెనుక పెద్ద‌ డ్రామానే న‌డుపుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.