Publish Date:Aug 29, 2022
భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. కోటి ప్రజాధనం వృధాకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు. సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.
అసలు విషయమేమిటంటే.. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియకు 2020లో వివాహమైంది. భర్త శ్రీనివాసరావు హైదరా బాద్‌లో ఒక ఫార్మాకంపెనీలో పనిచేస్తున్నాడు. తమ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి అతను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్‌కీ తీసికెళ్లాడు. బీచ్ అనగానే సరదాగా గడపడమే కదా. ఏవో నాలుగు కబుర్లు, రెండు ఐస్క్రీమ్ లతో సాయింత్రం గడిపేయచ్చని, మాట్లాడుకోవచ్చని వాళ్లి ద్దరే వెళ్లారు. కొంత సేపటికి శ్రీనివాస్‌కి ఫోన్ వచ్చి కొద్దిగా అవతలకి నడుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి వెనక్కి తిరిగి చూస్తే భార్య సాయిప్రియ కనపడలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భయపడ్డాడు. బీచ్ అంతా కలయ తిరి గాడు. కానీ ఎక్కడా ఆమె జాడ లేదు. అంతే అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా వెతికినా వారికీ కనిపించలేదు. ఏకంగా శ్రీనివాస్ నే కొంతమంది అనుమానించారు.
యావత్ విశాఖ ఖంగారెత్తింది. శ్రీనివాస్ అత్తింటివారు, స్నేహితులు జల్లెడ పట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొరకలేదు. ఇదేం మాయరా నాయనా అని అనుకున్నారు. బాదపడ్డా రు. అంతలో ఒకవేళ నిజంగానే ఏదో పెద్ద అలా సముద్రంలోకి లాక్కెళ్లిందేమోనని సందేహాలు వ్యక్తమ య్యాయి. చాలామంది అదీ జరగవచ్చనుకున్నారు. అంతే వెంటనే భద్రతాదళాలు, హెలి కాప్టర్లతో సిద్ధ మయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఇది మరింత ఆసక్తికర అంశమైంది.
అమ్మాయి దొరకలేదు గాని కోటిరూపాయల ఖర్చు అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చిందని అమ్మాయి తండ్రే పోలీసులకు చెప్పారు. విషయమేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. రవి అనే అబ్బాయిని విశాఖలో ప్రేమించింది. అతనితో బంగళూరులో ఉంది. అక్కడికి వెళ్లడా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బలయింది శ్రీనివాస్, తల్లిదండ్రుల పరువు. ప్రజాధనం కోటి రూపాయ ల ఖర్చు. మరో షాకింగ్ సంగతేమిటే, ఆ రోజు బీచ్‌కి సదరు ప్రేమికుడు కూడా రావడం! అంతా తెలిసిన తరువాత పోలీసులు ఇప్పుడు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-file-case-on-saipriya-and-her-liver-25-142834.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.