Publish Date:Nov 30, 2024
రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పులివెందులలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఇప్పటి వరకూ అందరూ చెబుతున్న మాట. పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. వైఎస్ మరణం తరువాత కుటుంబంలో విభేదాలు తలెత్తినప్పటికీ, అక్కడ జగన్ అధిపత్యం ఇసుమంతైనా తగ్గలేదు. పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగానికి తోడు జగన్ రెడ్డి రాజ్యాంగం కూడా జమిలిగా అమలు అవుతోంది. అక్కడ వైసీపీగూండా రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందరి నోటా అదే మాట. అయితే ఏపీలో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు చేపట్టిన ఐదు నెలల తరువాత పరిస్ధితిలో క్రమంగా మార్పు వస్తున్నది. వైసీపీ గూండాల ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రారవీందర్ రెడ్డిని పులివెందుల గడ్డమీదే అరెస్టు చేసి జైలుకు తరలించారు.
తాజాగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా మూడేళ్ల నుంచి సాగిస్తున్న కార్ల దందాకు చెక్ పెట్టారు. విషయమేంటంటే.. తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి నుంచి పులివెందులకు చెందిన వైసీసీ నేతలు అద్దె కోసం అంటూ తీసుకువెళ్లారు. మూడేళ్ల నుంచీ అటు అద్దె చెల్లించకుండా, ఇటు కార్లు ఇవ్వకుండా వేధిస్తూ వస్తున్నారు. ఇదేంటని అడిగిన సతీష్ కుమార్ పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. ఈ విషయమై మూడేళ్ల కిందటే తెలంగాణ పోలీసులకు సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే జగన్, రాజారెడ్డిల రాజ్యం అమలౌతున్న కాలం అది. పోలీసులు చర్యలు తీసుకోలేదు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో మూడేళ్ల నాటి కేసు ఫైలు బూజు దులిపిన తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో అడుగుపెట్టి వైసీపీ గూండాల చెర నుంచి సతీష్ రెడ్డి కార్లను విడిపించి అతనికి అప్పగించారు. అసలేంజరిగిందంటే.. మూడేళ్ల కిందట మెడికల్ కాలేజీ కోసం అంటూ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ కు చెందిన ఆరు కార్లను వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్ పై తీసుకువెళ్లారు. ఆ తరువాత అలా కార్లు తీసుకువెళ్లిన వారి ఆచూకీ సతీష్ కుమార్ కు దొరకలేదు. దీంతో జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ కార్లు పులివెందులకు చెందిన నేతల చేత్లుల్లో వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సతీష్ కుమార్ వేంపల్లో వెళ్లి కార్లు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వారు అతనిని ఇడుపుల పాయలో బంధించి భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పట్టించుకోని పోలీసులు ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదిలారు. కడప పోలీసుల సహాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో గాలించి కార్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని సతీష్ కుమార్ కు అప్పగించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-check-to-ycp-atrocities-25-189240.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.