అంబటి రాంబాబుపై కేసు
Publish Date:Jun 5, 2025
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ పిలుపు మేరకు బుధవారం (జూన్ 4) జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలో కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై అనుచిత భాషలో రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బుధవారం (జూన్ 4) వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారుజ అందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో గుంటూరులో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. ర్యాలీలకు అనుమతుల్లేవని పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. ఒక దశలో రెచ్చిపోయి పోలీసులపై అనుచిత భాష ప్రయోగించారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. దమ్ముంటే ర్యాలీ ఆపు అంటూ అంబటి రాంబాబు సీఐపై రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
http://www.teluguone.com/news/content/police-case-on-ambati-rambabu-39-199350.html





