పిన్నెల్లి వీడియో లీక్ చేసింది పోలీసులేనా? సీఈవో మాటలకర్ధం అదేనా?

Publish Date:May 23, 2024

Advertisement

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆ పార్టీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తడానికే దోహదపడింది. అంబటి వంటి నాయకులైతే నిస్సిగ్గుగా ఈవీఎం పగులగొట్టడాన్ని పక్కన పెట్టి అసలా వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది అంటూ ప్రశ్నించడం విస్మయపరిగింది. అంబటి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు. 

అయితే ఆ వీడియో ఎలా వెలుగులోకి వచ్చి ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన ప్రాయంగానైనా సరే వెల్లడించేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ కు వీడియో ఫుటేజిలు అప్పగించామని చెప్పారు. అంటే సిట్ అధికారులే ఈ వీడియోను లీక్ చేశారని ఆయన చెప్పకనే చెప్పేశారు. అదే జరిగితే అధికారులే విపక్షానికి మేలు చేసే విధంగా వీడియో లీక్ చేశారంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నదానికి ఇంత కంటే బలమైన సంకేతం ఏముంటుంది? 

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కనిపెట్టే అవకాశం ఇంకెవరికన్నా పోలీసు  శాఖకే అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక ఎమ్మెల్యేను ఏడేళ్ల పాటు జైలుకు పంపిం చేందుకు సాక్ష్యంగా ఉన్న వీడియో గురించి. ఈ వీడియో ఎమ్మెల్యేను నేరస్తుడిగా నిరూపించడమే కాదు, వైసీపీ ప్రతిష్టను కూడా కొలుకోలేనంతగా దెబ్బతీసింది.  నిజంగా క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీకి ప్రజా మద్దతు ఉండి ఉంటే, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి ఎన్నికౌతారనుకుంటే కచ్చితంగా పోలీసలు ఈ వీడియోను లీక్ చేయరు.  గత ఐదేళ్లుగా పోలీసు శాఖ జగన్ కు అనుకూలంగా ఎంతగా నింబంధనలకు కూడా తిలోదకాలిచ్చేసి పని చేసిందో చూశాం.  

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా అరెస్టు చేశారో చూశాం. అలాగే చంద్రబాబు అరెస్టు కు సంబంధించి సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడిన వైనాన్ని గమనించాం. అటువంటి పోలీసు శాఖ  జగన్ కు జగన్ పార్టీకీ భారీ నష్టం చేకూరుస్తుందని తెలిసి కూడా లీక్ చేశారంటే.. రాబోయే సర్కార్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కాదన్న నిర్ధారణకు వచ్చేశారనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి  ఈసీ ద్వారా బీజేపీ సహకారం అందిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెడితే అది తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా విశ్వసిసించినా కూడా  బీజేపీ తెలుగుదేశంకు ఈ రకంగా సహకారం అందించే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఉండవు,  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను విమర్శించే విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో ఎన్నికల ప్రచార సమయంలో చూశాం.  స్వయంగా ప్రధాని మోడీయే తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా  బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు ముందుకు రాదు.  అయినా   ఎన్డీయే కూటమిలో తన తరువాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అన్న సంగతి తెలిసిన బీజేపీ, జగన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంత మాత్రం సాహసించే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే పోలీసుల ద్వారానే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో విడుదలైందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ కొంప ముంచేసేవిగానే ఉన్నాయని అర్ధం. పరిశీలకులు దీనినే ఉటంకిస్తూ జగన్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.