పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ అనుచరులు!

Publish Date:Nov 19, 2024

Advertisement

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వల్లభనేని అనుచరులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి సూత్రధాని వంశి అన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కార్యాలయ ఆవరణలోని కారు దగ్ధం చేశారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే జగన్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం కేసు దర్యాప్తు నత్తనడకన సాగింది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఒక దశలో వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే కోర్టు నుంచి రక్షణ పొందిన వంశీ అరెస్టును తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో వంశీ అరెస్టు కూడా అనివార్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తె

లుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నేరుగా పాల్గొనకపోయినా, కార్యకర్తలను ప్రేరేపిం చింది వంశీయేనని పోలీసులు గట్టిగా చెబుతున్నారు.   వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం గన్నవరంలో పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరవాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. పలువురిని అరెస్టు చేశారు.  ఒక దశలో వల్లభనేని వంశీని కూడా అరెస్టు చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అవేమీ వాస్తవం కాదని తేలింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు వంశీ అనుచరులైన ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారించి తదుపరి వంశీని కూడా విచారణకు రావలసిందిగా నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు, మొత్తం మీద ఒకింత ఆలస్యమైనా వంశీ పాపాల పుట్ట పగలడం ఖాయమని, కటకటాలు లెక్కించక తప్పదని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.