పాదయాత్ర సజావుగా సాగాలి..అందుకు పోలీసులదే బాధ్యత.. హైకోర్టు తీర్పు

Publish Date:Oct 21, 2022

Advertisement

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సిట్యువేషన్ క్రిటికల్ గా ఉంది. అమరావతి వర్సెస్ మూడు రాజధానులపై పొలిటికల్ మ్యాచ్ హోరోహోరీగా సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజా మద్దతు ఉండగా.. వైసీపీ మూడు రాజధానుల పోరాటానికి అధికారులు దాసోహమంటూ అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడమే తన విధి అని భావిస్తున్నారు.

అమరావతి రైతులది స్వచ్ఛంద పోరాటం అయితే  మూడు రాజధానుల ఐకాస పేరుతో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉంది. అయితే ప్రజా మద్దతుతో అమరావతి రైతులు తమ పాదయాత్రను దిగ్విజయంగా సాగిస్తున్నారు. కానీ దారిపొడవునా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముళ్లు, రాళ్లూ రప్పలు, నీళ్ల సీసాలు దాడులు, అల్లరిమూకల దుర్భాషలను తట్టుకొని ముందుకు సాగుతున్నారు.

అయితే తాము తలపెట్టిన మహా ఉద్యమం.. చివరి గమ్యానికి చేరుకునే సమయానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్న అమరావతి రైతులు మరోసారి న్యాయస్థానాన్నిఆశ్రయించారు. రైతులపాదయాత్రకు అడ్డంకులపై హైకోర్టు సీరియస్ అయ్యింది.  ప్రస్తుతం అమరావతి రైతు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. కొద్దిరోజుల్లో విశాఖలో అడుగు పెట్టనుంది. విశాఖ క్యాపిటల్ రాజధాని వద్దంటూ చేపడుతున్న అమరావతి రైతులకు విశాఖపట్నంలో అడుగుపెట్టే హక్కు లేదంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరికలుజారీ చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకూ వెనుకాడటం లేదు.

ఈ నేపథ్యంలోనే మహాపాదయాత్ర విశాఖ చేరుకునే సరికి శాంతి భద్రతల సమస్య సృష్టించైనా యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు రైతులకు ఎటువంటి అవాంతరాలూ లేకుండా పోటీగా ఇతరులెవరూ నిరసన తెలపకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.  

మహాపాదయాత్రను అడ్డుకుంటున్నారంటూదాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించిన హైకోర్టు పాదయాత్ర సజావుగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కోర్టు ముందు వివరాలు ఉంచాలని గురువారం న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఇరుపక్షాలు వివరాలను సమర్పించాయి.  ఇరువైపుల వాదనలు, వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం (అక్టోబర్ 21) తీర్పు వెలువరించింది.

పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపుల ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది. గతంలో పాదయాత్రలో పాల్గొనేందుకు ఏయే వాహనాలకు అనుమతి ఉందో ఆ వాహనాలు  మాత్రమే పాదయాత్రలో ఉండాలని పేర్కొంది. ఇక రైతుల పాదయాత్ర సజావుగా జరిగేలా, వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.  

By
en-us Political News

  
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.