Publish Date:Jun 15, 2022
బిజెపి ప్రైవేటు దళంలా పోలీసులు తమ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి బలవంతంగా లోప లికి వచ్చి కార్య కలాపాలను అడ్డుకోవడమేకాకుడా, కార్యకర్తలను చితకబాదడం పట్ల కాంగ్రెస్ బిజెపి ని దుమ్మెత్తి పోస్తోంది. బుధవారం ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి తమ కార్యకర్తలను కొందరిని అకారణంగా తీసికెళ్లారని కాంగ్రెస్ ఎంపి కార్తి పి.చిదంబరం ట్విటర్‌లో ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విటర్ వీక్షకులకు పంచారు. ఢిల్లీ పోలీసులు బిజెపి ప్రయివేటు మిలిషియా గా వ్యవహరించారని ఎం.పీ ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యాలయం నుంచి అధికార ట్విటర్‌లోనూ అదే వీడియోను విడుదల చేశారు. ఎవరు పోస్టు చేశారో తెలియని ఆ వీడియోలో ప్రధాని మోదీని డిక్టేటర్‌గా అభివర్ణించారు. ఇటువంటి గూండాగిరీ, దాడులు చేపట్టే పక్షంలో ప్రజాస్యామ్య బద్ధంగా దేశాన్ని పరిపాలించే కుర్చీ మీద నుంచి దిగి, ధైర్యం వుంటే ప్రజల సమక్షంలోకి రావాలని డిమాండ్ చేసేరు. కొంత హిందీలో కూడా మాటలు వినిపించాయి. కాంగ్రెస్ కార్యాలయానికి గూండాలను పంపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని ట్వీట్‌లో అన్నారు. అందులో ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి అసలు మీరు ఎందుకు దౌర్జన్యంగా ప్రవేశించారని పోలీసు అధికారిని ప్రశ్నించడం కనిపించింది. అతను ఇంకా తన ఫోన్‌లో రికార్డింగ్ చేస్తుండగాన్నే అతన్ని పోలీసులు అవతలకి లాక్కెళ్లారు.
ఇదిలా వుండగా అసలు తాము కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి బలవంతంగా దూసుకు వెళ్లనేలేదని పోలీసులు అంటున్నారు. కార్యాలయం వద్దనే చాలా మంది పోలీసు బ్యారీకెడ్‌లను తీసి విసిరేరని, అందు వల్ల కొంత ఘర్షణ జరిగిందని పోలీసు అధికారి ఒకరు అన్నారు. అసలు పోలీసులు ఆ పార్టీ కార్యాల యంలోకి వెళ్లనే లేదని, లాఠీఛార్జీ చేయలేదని అన్నారు. కాగా, పోలీసులు ఈ విధంగా దూసుకు రావడం గురించి కె.సి.వేణుగోపాల్, భూపేష్ బాఘేల్, రణదీప్ సూర్జీవాలా, అధిర్ రంజన్ చౌదరీ తదితర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చర్చించారు. అసలు దేశంలో ప్రతిపక్షం మీద అన్ని విధాలా దాడులు చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకున్న సం గతి ఈ విధంగానూ స్పష్టమయిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఇంతలా దాడి చేయించడం ఇదే మొదటిసారి అని కాంగ్రెస్ ముఖ్య మంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘెల్ అన్నారు.
అసలు దేశంలో ప్రతిపక్షం వుండరాదన్న లక్ష్యంతో ఇలాంటి దాడులకు పూనుకుని అప్రతిష్ట పాలు కావ డంలో సరదా ఏమిటో మరి బిజెపీ నేతలు, మేధావులే స్పష్టంచేయాలి. బుధవారం నాటి దాడితో బిజెపి, మోదీ ప్రభుత్వం పరిమితులు దాటి వ్యవహరించడం గురించి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవస రం కూడా వుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-acting-as-bjp-private-army-39-137720.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.