ఏపీలో వైసీపీ అనుబంధ సంస్థగా పోలీసు వ్యవస్థ

Publish Date:Oct 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టం అమలులో ఉందా? ఆ రాష్ట్రంలో న్యాయం అన్న పదానికి మరో అర్ధం ఉందా? సామాన్య ప్రజల నుంచి పరిశీలకుల వరకూ అందరిలోనూ ఇదే సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో భారత రాజ్యాంగం అమలు అమలుకు నోచుకోవడం లేదన్న భావన రాష్ట్ర ప్రజలలో వ్యక్తం అవుతోంది. నిరసన తెలిపే హక్కును అధికారపార్టీ కాలరాసేసిందనీ,  పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుబంధ సంస్థగా పని చేస్తోందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించినా, నిరసన గళం వినిపించినా జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు వీర విహారం చేస్తాయి. విపక్ష నేతలపైనే కేసులు నమోదౌతాయి.

అధికార పార్టీకి చెందిన వారు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందు వెనుకలాడుతారు. అనివార్యంగా అరెస్టు చేయాల్సి వచ్చినా అరెస్టుకు ముందు, తరువాత కూడా రాచమర్యాదలు చేస్తారు. బెయిలుకు అడ్డు చెప్పరు. దర్యాప్తు ముందుకు కదలదు. అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి విషయంలో చిన్న చిన్న ఘర్షణ కేసుల్లో కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారు. ఎప్పుడో రెండు నెలల కిందట జరిగిన ఘర్షణ సంఘటనపై ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును మాచర్లలో అగస్టు 30న జరిగిన ఘర్షణ కేసులో ఇప్పుడు ఏకపక్షంగా ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంగళ్లు కేసులో నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్షింతలు వేసింది, ఆ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడానికి నిరాకరించింది. సుప్రీం కోర్టు ఏపీ పోలీసులపై అక్షింతలు వేసిన రోజునే  మాచర్ల పోలీసులు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఎవరో ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అరెస్టు చేయడమే ధ్యేయమన్నట్లు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా   వందల మంది పోలీసులతో తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేస్తారు. పద్ధితి ఉండదు. న్యాయస్థానాలకు సైతం తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెనుకాడరు.    రాజకీయకుట్రల్లో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దన్నుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, రాష్ట్ర పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నా ఖాతరీ లేదు. ఏలిన వారి సేవలో తరిస్తే చాలు అన్నట్లుగా ఏపీ పోలీస్ తీరు ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతి అధ్వానంగా మారిపోయింది. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు యథేచ్చగా జరుగుతున్నా నో పోలీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలిపారంటూ అరవై మందిపై కేసులు పెట్టారు.   పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 ఆంక్షలు రాష్ట్రంలో నిరవధికంగా అమలు అవుతున్నాయి. ఏపీలో ఎమెర్జెన్సీ పరిస్థితులు కొలువుతీరి ఉన్నాయి.  అధికార పార్టీ నేతల అండతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న వారిపై నో కేస్..విపక్ష నేతలపై రాజకీయ వేధింపుల విషయంలో మాత్రం పోలీసులు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.  

 ఏపీ పోలీస్ వ్యవస్థ జగన్ పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల దురాగతాలు, దారుణాలు జరిగిపోతున్నా అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అసలా విషయమే మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎందుకు పని చేస్తోంది. ఎవరి తరఫున పని చేస్తోంది అన్న ప్రశ్నలు జనబాహుల్యంలో వినిపిస్తున్నాయి.  
అధికార పార్టీ అరాచకాలకు, అన్యాయాలకు, అడ్డగోలు దాడులకు వత్తాసు పలకడానికీ, వారి తరఫున ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిమితమైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలను అడ్డగోలుగా అరెస్టు చేయడానికీ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై కేసులు బనాయించడానికీ తప్ప పోలీసులు సామాన్యుల రక్షణ కూడా తమ విధినిర్వహణలో భాగమని మరిచిపోయారా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసినా పోలీసులు ఆయనకు కొమ్ము కాయడానికే ప్రయత్నించడం, తన సోదరిని వేధిస్తున్నాడని నిలదీసిన బాలుడిని హత్య చేసి దహనం చేయడం వంటి సంఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులు తీరు బాధితులకు స్వాంతన కలిగించేలా నిందితులను అరెస్టు చేయడం, చర్యలు తీసుకోవడానికి బదులుగా నిందితులకు వత్తాసుగా నిలిచిన సంఘటను నిత్యం జరుగుతున్నాయి.  మహిళలపైఅత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. విపక్ష పార్టీ నేతలపై వైసీపీ మూకలు యథేచ్ఛగా దాడులకు పాల్పడినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి దన్నుగా నిలిచి బాధితులపైనే కేసులు పెడుతున్న సంఘటనలు కొకొల్లలు. అంగళ్లులో విపక్ష నేతపై వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేస్తే.. కేసులు మాత్రం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై నమోదు చేశారు. ఏ సందర్భంలోనూ కూడా బాధితులకు అండగా పోలీసులు నిలిచిన సందర్భం కనిపించదు. గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే నో పోలీస్. అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది రోజుల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోతే.. నో పోలీస్. ఆ చిన్నారి అదృష్టం, తల్లిదండ్రుల అదృష్టం దాదాపు 24 గంటల తరువాత నరసరావు పేట ఉప్పల పాడు వద్ద చిన్నారి ట్రేస్ అయ్యింది. తల్లిదండ్రుల వద్ద కు చేరిందనుకోండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా నేరాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. మొత్తంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట గంగలో కలిసిపోయినా పోలీసు బాసులకు పట్టడం లేదు. వందల మంది పోలీసులను ప్రభుత్వ పెద్దల, వైసీపీ నేతల ఆదేశాలను అమలు చేయడానికి నియోగించి రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడానికీ, ఆయన అరెస్టు అనంతరం వెల్లువెత్తిన శాంతియుత ర్యాలీలు, నిరసనలను అణచివేయడానికి మాత్రం వేల సంఖ్యలో పోలీసుల మోహరిస్తారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేయడానికి , ఆయన నివాసాన్ని చుట్టుమట్టడానికీ మాత్రం వందల సంఖ్యలో పోలీసులు రెడీగా ఉంటారు. అయితే బాధితుల పక్షాన నిలవడానికీ, వారికి న్యాయం చేయడానినీ, దాడులకు గురయ్యే వారిని రక్షించడానికీ మాత్రం నో  పోలీస్. ఇదీ ఏపీలో రాష్ట్ర పోలీసుల తీరు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.