వినియోగంలోకి పోలవరం స్పిల్ వే గేట్లు

Publish Date:Jul 13, 2022

Advertisement

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. కానీ దానిని సత్వరమే పూర్తి చేయడానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను పరుగులు పెట్టించారు.   ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టు పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాకా నత్తనడకన సాగుతున్నాయి.  అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల పనులు పూర్తయ్యాయి. ఆ ఫలితం ఇప్పుడు తెలిసింది. చంద్రబాబు దార్శనికత ఫలితం రాష్ట్ర ప్రజలకు మరో సారి అర్దమైంది.  వరదనీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ   సమర్థవంతంగా పనిచేసింది. ప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. ఈ స్పిల్ వేలోని  48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా   పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరి నది దిగువకు విడుదల చేశాయి.

ప్రాజెక్టులోని మొత్తం 48 గేట్లను ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పని తీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరదనీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్లు కీలకపాత్ర వహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వర్షాకాల సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి.

గోదావరి నదికి ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడం వందేళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును అధికారులు ముందుగానే సిద్ధంగా ఉంచారు. స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.

వందేళ్ళ చరిత్రను ఆధారం చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను   డిజైన్ చేశారు. వందేళ్ళలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారని మేఘా ఇంజనీరింగ్ సంస్ద సీజీఎం చెప్పారు. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్ల నుండి 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.