ఒడిశా మావోయిస్టులకు పోవవరానికి లింకు ఏమిటి?
Publish Date:Mar 24, 2012
Advertisement
ఒడిశాలలో ఉన్న మావోయిస్టులు ఇప్పుడు కొత్తగా పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ ప్రాంత మావోయిస్టులు పోలవరం ప్రాజెక్టు గురించి ప్రకటనలు చేయలేదు. నిజానికి ఈ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర రైతాంగం ఎన్నటినుంచో ఉద్యమాలు చేస్తోంది. తమ ప్రాంతంలో సకాలంలో పంటలు పండాలన్నా, సాగునీటి, తాగునీటి కొరత తీరాలన్నా పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రైతాంగం అంటోంది. అయితే లక్షలాది మంది రైతులు ఒక వైపు పోలవరం ప్రాజెక్టు కావాలని అడుగుతుండగా, మరోవైపు కార్మిక, కర్షక ప్రయోజనాలకోసం పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులు రైతులకు వరంలాంటి ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల మావోయిస్టులు ఇద్దరు ఇటాలియన్లను కిడ్నాప్ చేశారు. అటవీప్రాంతంలో కూంబింగ్ నిలిపివేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టును కూడా రద్దు చేయాలని ఒడిశాకు చెందిన మావోయిస్టులు షరతు పెట్టారు. నిజానికి ఒడిశా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఒడిశా ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆంధ్రాప్రాంతంలో మావోయిస్టుల వైఖరి ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆంధ్రాప్రాంత మావోయిస్టులు కూడా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్త ఏజెన్సీ ప్రాంతంలో వారికి షెల్టర్ దొరకడం కష్టమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/polavaram-project-24-12873.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





