వెలిగొండ, పొలవరం నీళ్లిస్తే జగన్ ఏడుపెందుకు?

Publish Date:Sep 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో  సాగునీటి రంగం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల,  ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. వైసీపీ  అధినేత జగన్ పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులపై ఇటీవల చేసిన ట్వీట్లు, విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై  తెలుగుదేశం అధికార ప్రతినిథి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

గత వైసీపీ  ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పసాని రాజేష్ వివరించారు. కాలువ నిర్మాణంలో అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్, అక్విడెక్ట్‌లు, కల్వర్టులు పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉంటే, నేడు పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అయన చెప్పారు.

ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు, వర్షాభావ వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు అందిస్తోందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, కానీ ఆనాటి ఆ నిర్ణయమే నేడు కృష్ణా డెల్టాను కాపాడిందని గుర్తుచేశారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 

ఇక వైఎస్ హయాంలో జలయజ్ణం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అప్పసారి రాజేష్ ఖండించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టిపనులు పూర్తి చేసి డబ్బులు దండుకుని చేసింది జలయజ్ణం కాదు, ధనయజ్ణమని విమర్శించారు. 

[Polavaram Left Canal, Veligonda, Polavaram Left Canal, Chandrababu Naidu Irrigation,  Jagan Credit Chori, Purushothapatnam lift irrigation, AP Politics News, Telugu One]

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.