పాలు పోసిన చేతినే కాటేసిన విషనాగు .. టర్కీ!

Publish Date:May 10, 2025

Advertisement

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది, అది సర్ప జాతి లక్షణం. కానీ.. మనిషన్నవాడు, మానవత్వం ఉన్న వాడు ఎవరైనా  చేసిన మేలును మరిచి పోడు. మరిచికూడదు. మరిచి పోతే వాడు మనిషి కాదు. విశ్వాస ఘాతుక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ  మృగం అనవచ్చును.  ఈ  ధర్మం వ్యక్తులకే కాదు  దేశాలకూ వర్తిస్తుంది. కష్ట కాలంలో ఆదుకున్న దేశాన్నిఅవసర సమయంలో ఆదుకోకపోకా వెన్ను పోటు పొడవడం దుర్మార్గాలలో కెల్లా మహా దుర్మారం. అమానుషం. అవును..  సాయమ చేసిన వారికి తిరిగి సాయం చేయక పోయినా  ఫర్వాలేదు కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు, దుర్మార్గానికి పాల్పడితే  అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాస ఘాతుకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అనవచ్చును.    

ఇప్పడు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కాని అప్రకటిత యుద్ధం జరుగతున్న సమయంలో టర్కీ, అలాంటి దుర్మార్గానికి పాల్పడింది. విష సర్పమై  పాలు పోసిన భారత దేశాన్నే కాటు వేసింది. రెండేళ్ళ క్రితం  2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా టర్కీ లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ప్రాణ, ఆస్తి నష్టంకూడా టర్కీలోనే ఎక్కువగా జరిగింది.  భూకంప ప్రభావానికి  దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంచు మించుగా 50 వేల మందికి పైగా   చనిపోయారు.    

అలాంటి సమయంలో.. అంతటి విపత్కర పరిస్థితిలో టర్కీకి నేనున్నానంటూ స్నేహ హస్తం అందించిన తొలి దేశం   భారత దేశం. ప్రపంచ దేశాలన్నీ మీన మేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్‌ దోస్త్‌  పేరిట స్నేహ హస్తాన్ని అందించింది.  భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది.  అంతటి  కష్ట కాలంలో  భారత దేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే ఇప్పుడు టర్కీ భారత దేశం చేసిన సహాయాన్ని మరిచి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు  అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది. 

పాకిస్థాన్‌ గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో భారత్‌ పై డ్రోన్‌ దాడులు చేసింది. వందల సంఖ్యలో  డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్‌ ను గాలిలోనే  పేల్చి వేశాయి.  నేల కుల్చాయి.  పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం  ఆ దేశ నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది.అవును. ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి  చెందిన  అసిస్‌ గార్డ్‌ సోనగర్‌  డ్రోన్లుగా ధ్రువీకరించారు. 

అయితే..  ఒక విధంగా ఇది అనూహ్య పరిణామంమ కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత దేశం పట్ల  విపరీతమైన ద్వేషం వుంది. అదేమీ రహస్యం కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ఎర్దొగాన్‌ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతే కాదు..  ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు. 

పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత దేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే   ఊహించింది. ప్రపంచమంతా భారత్ దేశం పట్ల  సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్‌ ప్రభుత్వం పంపింది. టర్కీ సి-130ఈ హెర్క్యూలస్‌ విమానం గత నెల 28న పాకిస్థాన్‌లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకొనేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి  ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది.  తర్వాత ఓ యుద్ధనౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ , అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తున్నాయి. కాశ్మీర్‌ అంశంలో గతంలో ఎర్డోగాన్‌ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా  భారత దేశం పై విమర్శలు చేశారు. ఇప్పడు పాముకు పలు పోసినా విషమే చిమ్ముతుందని, టర్కీ మరో మారు రుజువు చేసింది.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.