తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా.. మోడీ నాలుకకు రెండు వైపులా పదునే!

Publish Date:Nov 14, 2022

Advertisement

తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోడీ తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడి తన నాలుకకు రెండు వైపులా పదునేనని రుజువు చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ యేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం విధానాలతో విభేదిస్తోంది. విభజన చట్టంలోని హామీలను ఇంకా పరిష్కరంచకపోవడంపై నిలదీస్తోంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా గళమెత్తడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా మోడీని ఢీ కొనేందుకు కసరత్తుతు చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే ధ్యేయంగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి మోడీకి నేరుగా సవాల్ విసిరేందుకు సిద్ధమౌతున్నారు. ఇక ఏపీలో జగన్ సర్కార్ విషయానికి వస్తే.. విభజన హామీలను ప్రస్తావించదు.

అప్పులకు అనుమతులిస్తే చాలని వేడుకొంటోంది. అడుగులకు మడుగులొత్తుతోంది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలకు జనం  రాకపోయినా.. ప్రధాని మోడీ సభ కోసం శ్రమించి, బెదరించి మరీ జనసమీకరణ చేసింది. పోలవరం ప్రాజెక్టు గురించి నోరెత్తి అడిగిన సందర్భం లేదు. విశాఖ ప్రైవేటైజేషన్ కు అభ్యంతరం చెప్పదు. సరిగ్గా ఈ తేడాయే మోడీ తెలుగు రాష్ట్రాల పర్యటన సందర్బంగా ఆయన ప్రసంగంలో ప్రతిధ్వనించింది. తొలుత ఏపీలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. అలాగని అంత సాగిలపడిన ప్రభుత్వంపై కూసింత జాలి చూపి రాష్ట్రానికి ఏమైనా వరాలు ప్రకటించారా? అంటే అదీ లేదు. ఆయన పర్యటన విశాఖ సెంట్రిక్ గా జరిగింది కనుక విశాఖ జనాలకు తెలిసిన విశాఖ చరిత్ర చెప్పి నగరాన్ని ప్రస్తుతించి.. ప్రస్తుతానికింతే అని చెప్పకనే చెప్పారు.

మోడీ ప్రసంగానికి ముందు జగన్ తెలుగులోనే మాట్లాడినా బోలెడు వినతులు, విజ్ణప్తులు చేశారు. ఆయన భాష మోడీకి అర్ధం కాదు. ఆంగ్లంలో మాట్లాడితే అర్ధమై నొచ్చుకుంటారేమోనన్న భయమే జగన్ తన ప్రసంగం తెలుగులో చేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ప్రసంగంలో  మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ సమక్షంలోనే తాను మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించానని చెప్పడానికే ఆ ప్రసంగం పనికొచ్చింది కానీ మోడీ నుంచి దానిపై ఎటువంటి స్పందనా రాలేదు. ఇదీ మోడీ పర్యటన ఏపీలో సాగిన తీరు.. రాష్ట్రానికి ఎటువంటి వరాలూ కురిపించలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. వచ్చారు.. వెళ్లారు అంతే.

ఇక అదే తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఆయన ప్రసంగం పూర్తిగా రాజకీయ విమర్శలకు నెలవుగా మారింది. తనపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తిట్లు తిని చాయ్ తాగండి అంటూ సెటైర్లు వేశారు. అవినీతికి, అవినీతి నాయకులకూ చరమగీతం తప్పదని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రస్తావించి బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని వణికించారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఇది నాంది పలికిందని పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వ  వైఖరికి ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల మధ్య కమలం వికసించడం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యామిలీ ఫస్ట్ అనే సూత్రంతో పని చేస్తోందని మండిపడ్డారు. తాము మాత్రం పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తోన్నామని, ఈ రెండు పార్టీల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు.  

ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రశక్తే లేదని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అదే ఏపీలో జనం పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని జనం కోరుతున్నా పట్టించులేదు. ఏపీలో రాజకీయ లబ్ధి లేదు కనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించిన మోడీ... తెలంగాణలో అధికార ఆకాంక్ష తో సింగరేణిపై హామీ ఇచ్చారు.  తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఆయన ఏపీ పట్ల ఏమీ పట్టని వైఖరిని ప్రదర్శించి.. తెలంగాణలో రాజకీయ లబ్ధి ఆకాంక్షించి విమర్శలు గుప్పించారు. హామీలిచ్చారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.