దేశ ప్రజలకు ప్రధాని మోడీ థ్యాంక్స్.. ఎందుకంటే?

Publish Date:Jun 29, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు  ధ్యాంక్స్ చెప్పారు. ఆదివారం (జూన్ 28) ఆకాశవాణి ద్వారా ప్రజలతో మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  అంతర్జాతీయంగా ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంలో  ఇండియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి రుజువైందన్నారు.  ఇంతకీ విషయమేంటంటే.. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు,  యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ    దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇంధనాన్ని కూడా పెద్ద ఎత్తున పొదుపు చేయాలని కొన్ని రోజుల కిందట పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన పిలుపు మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేశారు. అలాగే ఇంధన పొదుపు కూడా పాటించారు. దీనినే తన మన్ కీబాత్ లో ప్రస్తావిస్తూ.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రస్తుతం సీషెల్స్ అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి తన 135వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో  ప్రసంగించారు. 

అంతర్జాతీయ సంక్షోభ సమయంలో  దేశ ప్రజలు కనబరిచిన ఈ అసాధారణ క్రమశిక్షణ, సామూహిక సహకారం  ఐక్యతకు, అంతర్గత శక్తికి నిదర్శనమన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు కొత్తగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి దూరంగా ఉన్నాయనీ, అలాగే  ఇంట్లో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా కొత్త బంగారం కొనకుండా, పాత బంగారు ఆభరణాలనే వినియోగించారనీ ప్రధాని చెప్పారు.  అలాగే.. దేశంలో ఇంధన వాడకాన్ని తగ్గించడానికి కూడా ప్రజలు ప్రయత్నించారని మోడీ వివరించారు. 

అనేక మంది తమ విదేశీ పర్యటనలను  వాయిదా వేసుకున్నారని, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించారని,  మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతంగా ఆశ్రయించడం ద్వారా దేశంలో భారీగా ఇంధనాన్ని ఆదా చేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సామూహిక కృషి అంతర్జాతీయ వేదికపై భారతదేశ స్థానాన్ని, ప్రతిష్టను ఇనుమడింప చేస్తుందన్నారు.  

ఇంకా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ  అహ్మదాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ యోగా ఆసనాల ఛాంపియన్‌షిప్‌లో  ఇండియన్స్  కనబరిచిన అద్భుత ప్రతిభను  అభినందించారు. ఈ ప్రపంచ స్థాయి పోటీలలో భారత్ ఏకంగా 102 స్వర్ణ పతకాలతో  దూసుకుపోవడమే కాకుండా, మొత్తం 114 పతకాలను సొంతం చేసుకుని అంతర్జాతీయ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రధాని   

By
en-us Political News

  
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.