ప్రధాని ప్రసంగం విశాఖను ప్రస్తుతించడానికే పరిమితం?

Publish Date:Nov 12, 2022

Advertisement

మోడీ విశాఖ పర్యటనపై కనీవినీ ఎరుగని రీతిలో జగన్ సర్కార్ ఆర్బాటం చేసింది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించి మరీ జన సమీకరణ చేసింది. మోడీని మెప్పించి  రాష్ట్రాలనికి మేలు చేసేలా ఒకటి రెండు వరాలనైనా పొందాలని తాపత్రేయ పడింది.

అయితే మోడీ ప్రసంగం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. జగన్ ఆర్బాటం, తాపత్రేయం అంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మిగిలిపోయింది. అసలు మోడీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైన నాటి నుంచీ ఏపీ వాసుల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. గత ఎనిమిదేళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలలో కొన్నిటి విషయంలోనైనా మోడీ సానుకూల ప్రకటన విశాఖ వేదిక మీద నుంచి చేస్తారని ఆశించారు. అయితే మోడీ అసలా విషయాలనే పట్టించుకోలేదు. దేశంలో విశాఖపట్నం వినా మరో అద్భుత నగరం లేదన్నట్లుగా కేవలం విశాఖను ప్రస్తుతించేసి తన ప్రసంగాన్ని ముగించేశారు. దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనలో తన ప్రసంగంలో కేవలం ఒక్క నగరం గురించి ప్రస్తావించడానికే పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. 

ఏయూ   మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మాత్రం రాష్ట్ర ప్రజలకు నిరాశనే మిగిల్చింది.  మోడీ ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగింది.  హామీలు, వాగ్దానాలు లేవు. పెండింగ్ హామీల ప్రస్తావన లేదు.  దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై  ప్రకటన లేదు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డుకు  గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు మోడీ ప్రకటన చేస్తారనీ,  106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి ఇస్తున్నట్లు విశాఖ వేదికగా చెబుతారనీ అంతా భావించారు.

అదేమీ లేదు. అఖరికి వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ సైతం ఇవ్వలేదు.  యధా ప్రకారం ప్రజలను రంజింపచేయడానికి ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీకి   రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇప్పుడు మరో సారి రాష్ట్ర పర్యటన రావడం మరెంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలో విశాఖ ఒకటన్న మోడీ...  ఆ నగర ప్రాశస్థ్యాన్ని వివరించడానికే పరిమితమయ్యారు. విశాఖ చరిత్రను వివరిస్తూ చెప్పింది వినండి అన్నట్లుగా వ్యవహరించారు.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.