Publish Date:Jul 25, 2021
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ.. సామాజిక మాధ్యమాల్లో రైతులకు ఏపీ వెదర్ మన్ పేరుతో వాతావరణ సమాచారం అందిస్తూ సాయి ప్రణీత్ మంచి పని చేస్తున్నారని చెప్పారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్ రైతులకు అందిస్తోన్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలను మన్ కీ బాత్‌లో మోడీ ప్రస్తావించారు.
చండీగఢ్‌కు చెందని 29 ఏళ్ల సంజయ్ రాణాను కూడా మోదీ ప్రశంసించారు. ఆ యువకుడు ఫుడ్ స్టాల్ ను నిర్వహిస్తుంటాడని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భతూర్ అనే వంటకాన్ని అమ్ముతుంటాడని మోడీ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయన ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. తమిళనాడులోని నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మహిళ అంబర్క్స్ ప్రాజెక్ట్ చేపట్టి సేవలందిస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. కొండ ప్రాంతాల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని వారి కోసం ఆమె ఉచితంగా రవాణా సదుపాయాలను కల్పిస్తున్నారని చెప్పారు. తన సహచర ఉద్యోగుల వద్ద విరాళాలు సేకరించి ఆమె ఈ సేవలు కొనసాగిస్తున్నారని ప్రధాని వివరించారు. ఆమె మొత్తం ఆరు అమ్‌బర్క్స్ సర్వీసులు నడిస్తున్నారని కొనియాడారు.
ప్రజలకు కొవిడ్ జాగ్రత్తలు చెప్పారు ప్రధాని మోడీ. పండుగలు, శుభకార్యాలు జరుపుకునే సమయంలో కరోనా ఇంకా తొలగిపోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కరోనా ఇంకా మన మధ్యే ఉందని, కొవిడ్ నియంత్రణ నియమాలను మర్చిపోకూడదని మోడీ తెలిపారు. ఒలింపిక్ ప్లేయర్లు ఎన్నో కష్టాలు భరించి... ఆ స్థాయి కి వెళ్లారన్న ప్రధాని మోడీ.. వారిని సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోడీ.. మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు ప్రధాని మోడీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pm-modi-praise-tirupathi-young-boy-sai-praneeth-25-120294.html
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.