Publish Date:Aug 15, 2022
నేటి బాలలే రేపటి పౌరులు.. ప్రధాని మోడీ ఆ రేపటి పౌరులతో మమేకమై వారిని ఉత్సాహ పరుస్తూ వారి మధ్య కలియదిరిగారు. వారు నృత్యం చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
ఈ దృశ్యం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద కనిపించింది. ఎర్రకోట బురుజుల మీద నుంచి ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమానికి వచ్చిన చిన్నారుల వద్దకు వెళ్లారు. దేశ పటం ఆకారం లో కూర్చుని ఉన్న వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వా
రిని వారి వారి సంప్రదాయాలకు అనుగునంగా నృత్యం చేయమని ప్రోత్సహించారు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. మోడీ చిన్నారులతో కలిసి ముచ్చటించడం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేదు. హఠాత్తుగా ప్రధాని పిల్లల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడం, వారి మధ్య కలియదిరగడంతో పిల్లలలో ఉత్సాహం వెల్లివిరిసింది. వారంతా మోడీతో మాట్లాడేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pm-modi-mingle-with-childern-25-141952.html
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.