సింగపూర్ లో.. సముద్రాన్ని పూడ్చి ప్లాంట్ ఎలా కట్టారో తెలుసా ?
Publish Date:Aug 3, 2025
Advertisement
ఇటీవల సింగపూర్ పర్యటించిన చంద్రబాబు బృందం అక్కడ సముద్రాన్ని పూడ్చి నిర్మించిన ఒక దీవిలోని పెట్రోల్ ప్లాంట్ ని సందర్శించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఒక సముద్రాన్నే పూడ్చి ప్లాంటు నిర్మించగా లేనిది.. అమరావతిలోని ఈ మాత్రం నీటిని పూడ్చడం ఎంత పని? కానీ ఇక్కడే జగన్ మార్క్ విధ్వంసమే ప్రధాన అడ్డంకిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విచ్చలవిడిగా పెట్టిన ఖర్చు.. ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి ఆటంకాలను సృష్టిస్తోంది. గత జ. మో. రె. (జగన్ మోహన్ రెడ్డి) పాలనలో ఐదేళ్ల పాటు అప్పు చేసి మరీ సంక్షేమానికి పెట్టిన ఖర్చు అక్షరాలా రెండున్నర లక్షల కోట్లు. ఇదంతా ఆయన గెలుపునకూ పనికి రాలేదు. రాష్ట్రానికీ పనికి రాలేదు. దీంతో ఎప్పటిలాగానే మళ్లీ మొదటికే వచ్చింది వ్యవహారం. జగన్ గానీ కాస్త విచక్షణతో రాజధాని గురించి ఆలోచించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. జగన్ పాలన ఎలా ఉందంటే తన ఓట్ల కోసం జనానికి జనం సొమ్ము దోచి పెట్టడం. మధ్యలో లిక్కర్ వంటి స్కాముల ద్వారా తను తన వాళ్లు జేబు నింపుకోవడం. జగన్ ఐదేళ్ల పాలనలో ఇది తప్ప మరేం చేయలేదన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లబ్దిదారు జనం కాదు జగన్ అన్నది జగమెరిగిన సత్యం. మూడు ముక్కలాట ఆడకుండా జగన్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే అమరావతి నిర్మాణం ఈ పాటికి పూర్తయ్యేది. అదే జరిగితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యేది. చేయాల్సిందంతా చేసి.. ఇక్కడి జనానికి పని లేకుండా పాడుబెట్టి అదేమంటే ఇది దేవతల రాజధాని కాదు- వేశ్యల రాజధాని అంటూ బురద జల్లడం. ఇక్కడ చేపలు పట్టడం తప్ప మరేమీ చేయలేమని కామెంట్లు గుప్పించడం వంటివి చూస్తుంటే.. జగన్ నిజంగానే రాక్షసుడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక మంచి కార్యం జరుగుతుంటే దాన్ని కాకుండా చెడగొట్టేవారిని రాక్షసులనే అంటారు. గతంలో దేవతలు యజ్ఞయాగాదులు చేస్తుంటే జగనాసురుడి వంటి రాక్షసులు ఇలాగే వ్యవహరించేవారు. జగన్ కూడా సరిగ్గా ఇలాగే అనిపిస్తున్నారు. సంకల్పం ఉంటే అన్నీ జరుగుతాయి. కానీ ఏదో ఒక వంక పెట్టి ఇటు జనానికి ఏదో ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి. ఆపై తాను బీభత్సంగా దోచుకుని.. చివరికి రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకుండా చేయడంలో మెయిన్ విలన్ గా జగన్ని తప్పక పరిగణించాల్సిందేనంటారు పరిశీలకులు. ఇలాంటి వారిని శాశ్వతంగా దూరం పెడితే తప్ప.. రాష్ట్రం రాజధాని బాగుపడదన్న మాట వినిపిస్తోంది.
,,,,,,,,,,,,,,,,,,,
http://www.teluguone.com/news/content/plant-constructed-in-singapore-burrying-sea-39-203396.html





