ఈవీఎంలతో పాటు అదృశ్య శక్తులు కూడా.. బీహార్ ఓటమిపై ప్రశాంత్ కిశోర్

Publish Date:Nov 25, 2025

Advertisement

ఇటీవ‌ల‌కాలంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఈవీఎంలను నిందించడం అలవాటుగా మారింది. తాజాగా బీహార్ ఎన్నికల ఓటమిపై స్పందించిన జన సురాజ్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా ఈవీఎంల కారణంగానే తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆరోపించారు. ఒక్క ఈవీఎంలే కాకుండా అదృశ్య శ‌క్తుల ప్ర‌మేయంవల్ల కూడా తాము  ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అయితే అదృశ్య శక్తుల ప్రమేయాన్ని తాము చాలా ఆలస్యంగా గుర్తించామని నొచ్చుకున్నారు. తాను చెబుతున్న విషయాలన్నీ అక్షర సత్యాలన్న ఆయన అయితే ఈ సత్యాలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు మాత్రం లేవనిచేతులెత్తేశారు.

 ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర ఓటమి పొందడం ఒక మిస్టరీగా ఉందన్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. జీరో స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పోటీ చేసిన మొత్తం స్థానాలలో పరాజయం పాలైంది. అంతే కాదు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయంది. దీనిపై ఆయన మాట్లాడుతూ తమ జన సురాజ్ పార్టీకి పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ డిపాజిట్లు గల్లంతైనా..3.5 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అయితే ఈ ఘోర పరాజయంతో పీకే గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పతనమైంది.  ఇంత కాలం ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ ఆయా పార్టీల విజయంలో తనదే సింహభాగమంటూ జబ్బలు చరుచుకున్న పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఆయనపై నెటిజెన్లు సెటైర్లు రువ్వుతున్నారు.  ఈ నేప‌థ్యంలోనే పీకే తాజాగా జాతీయ వార్తా సంస్థకు  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓటమికి కారణం ఈవీఎంలు, అదృశ్య శక్తులు అంటూ చెప్పుకొచ్చారు. 

“జనసురాజ్ పార్టీగా తాము బాగానే పని చేశాం అని కితాబిచ్చుకున్న పీకే..   ప్ర‌జ‌ల నుంచి కూడా తమకు మంచి మ‌ద్ద‌తు ల‌భించిందన్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తాలు ప‌లికారు. మేం సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ.. క‌నీసం 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని భావించాం.  కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. ఇలా అయిందంటూ పీకే నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే తాను ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను  త‌ప్పుప‌ట్ట‌డం లేద‌న్నారు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని, ఇప్పుడు అదేమిటో గుర్తించడమే తన ముందున్న పెద్ద టాస్క్ అన్నారు పీకే. 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.