Publish Date:Nov 25, 2025
ఇటీవలకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈవీఎంలను నిందించడం అలవాటుగా మారింది. తాజాగా బీహార్ ఎన్నికల ఓటమిపై స్పందించిన జన సురాజ్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా ఈవీఎంల కారణంగానే తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆరోపించారు. ఒక్క ఈవీఎంలే కాకుండా అదృశ్య శక్తుల ప్రమేయంవల్ల కూడా తాము ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అయితే అదృశ్య శక్తుల ప్రమేయాన్ని తాము చాలా ఆలస్యంగా గుర్తించామని నొచ్చుకున్నారు. తాను చెబుతున్న విషయాలన్నీ అక్షర సత్యాలన్న ఆయన అయితే ఈ సత్యాలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు మాత్రం లేవనిచేతులెత్తేశారు.
ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర ఓటమి పొందడం ఒక మిస్టరీగా ఉందన్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. జీరో స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పోటీ చేసిన మొత్తం స్థానాలలో పరాజయం పాలైంది. అంతే కాదు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయంది. దీనిపై ఆయన మాట్లాడుతూ తమ జన సురాజ్ పార్టీకి పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ డిపాజిట్లు గల్లంతైనా..3.5 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అయితే ఈ ఘోర పరాజయంతో పీకే గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పతనమైంది. ఇంత కాలం ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ ఆయా పార్టీల విజయంలో తనదే సింహభాగమంటూ జబ్బలు చరుచుకున్న పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఆయనపై నెటిజెన్లు సెటైర్లు రువ్వుతున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే తాజాగా జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓటమికి కారణం ఈవీఎంలు, అదృశ్య శక్తులు అంటూ చెప్పుకొచ్చారు.
“జనసురాజ్ పార్టీగా తాము బాగానే పని చేశాం అని కితాబిచ్చుకున్న పీకే.. ప్రజల నుంచి కూడా తమకు మంచి మద్దతు లభించిందన్నారు. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు ఘనంగా స్వాగతాలు పలికారు. మేం సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ.. కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటామని భావించాం. కానీ, ఏం జరిగిందో ఏమో.. ఇలా అయిందంటూ పీకే నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే తాను ఎన్నికల వ్యవస్థను తప్పుపట్టడం లేదన్నారు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని, ఇప్పుడు అదేమిటో గుర్తించడమే తన ముందున్న పెద్ద టాస్క్ అన్నారు పీకే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-find-fault-with-evms-and-invisiblepoer-for-defeat-25-210022.html
Publish Date:Mar 12, 2026
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.