బీహార్ లో పీకే ప్రభావమెంత?.. లాభమెవరికి.. నష్టం ఎవరిది?

Publish Date:Oct 3, 2025

Advertisement

ఒకప్పుడు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు తన పార్టీకి తాను ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు. ఔను ఒక్కప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఫలానా పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయ్యి ఉండాలి అని అంతా భావించారు.   2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమన్నది  పరిశీలకులు విశ్లేషణ. 

అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని త్వరలో బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఓంటరిగా రంగంలోకి దిగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ స్వరాష్ట్రం బీహార్ అయినప్పటికీ ఈ సారి ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మూడేళ్ల కిందట సరిగ్గా ఇదే నెలలో ఆయన జగన్ సూరజ్ పార్టీ అధినేతగా బీహార్ లో పాదయాత్ర ఆరంభించారు. అప్పటి నుంచీ రాష్ట్రమంతటా తిరుగుతూనే ఉణ్నారు. ఇప్పటి వరకూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 5500 గ్రామాలను పాదయాత్ర ద్వారా చుట్టేశారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభల వంటివి లేకుండానే.. తన పాదయాత్రలో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతున్నారు. భారీ ర్యాలీలూ, ప్రసంగాలకు దూరంగా. ఆయన ప్రజలలో మమేకమై వారి సమస్యల పరిష్కారం విషయంలో గట్టిగా నిలబడతానని హామీ ఇస్తున్నారు.

ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ పట్ల యువత ఆకర్షితులౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీఆర్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజా హృదయాలను గెలుచుకున్నారంటున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, ఓటమి అన్న అంశాల జోలికి పోకుండా జనసురాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ వాయిస్ ను వినిపించాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ ముందుకు సాగుతున్నారు. విశ్వసీయ సమాచారం మేరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ లో ప్రధాన పోరు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాకుండా స్వల్ప మొగ్గు ఇండి కూటమి (బీహార్ లో మహాఘట్ కూటమి) వైపే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని ఆ సర్వేలు చెబుతున్నాయి.

పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారి ఎన్పికల రణరంగంలోకి అడుగుపెట్టిన శాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టనున్నారు. సర్వేల అంచనా ప్రకారం ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ  8 నుంచి 11 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. అయితే సీట్ల పరంగా మాత్రం ప్రశాంత్ కిషోర్ జీరో నంబర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీ ఎనిమిది నుంచి 11 శాతం ఓట్లు సాధించడమంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చడమే అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి అటుంచితే..ప్రకాంత్ కిషోర్ కొత్త పార్టీతో తొలి సారి ఎన్నికల రణరంగంలోకి దిగి ఆ మాత్రం ఓట్ షేర్ సాధించడంటే మాటలు కాదని అంటున్నారు.   

By
en-us Political News

  
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.