Publish Date:Aug 11, 2022
బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది.
నితీష్ వ్యూహాలను పసిగట్టడంలో పీకే టోటల్ గా జీరో అయ్యారు. బీహార్ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పక్షాల ఐక్యతకు నాందిగా పరిశీలకులు విశ్లేషిస్తున్న వేళ ఎవరూ అడగకుండానే.. నితీష్ కు అంత సీన్ లేదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బీహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ వ్యూహ చతురతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. దాదాపు అన్ని విశ్లేషణలూ ఈ పరిణామం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి చేదు అనుబవాన్ని మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పాయి.
బీజేపీకి మిత్రపక్షాలన్నీ దూరం కావడం వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోడీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ విశ్లేషణలను కొట్టి పారేస్తూ.. నితీష్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యనించారు. బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఇసుమంతైనా ప్రభావితం చేయవని తేల్చేశారు. కేవలం నితీష్ స్వార్థం వల్లనే బీహార్ పరిణామాలు సంభవించాయని సూత్రీకరించారు. అంతే కాకుండా నితీష్ వ్యూహాలపై, వ్యవహార శైలిపై విమర్శలు చేశారు.
గత పదేళ్లుగా ఆయన బీహార్ లో చేస్తున్న రాజకీయ ప్రయోగాలన్నీ కుప్పిగంతులేనని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. గత పదేళ్లుగా తాను ముఖ్యమంత్రిగా కొనసాగడమే లక్ష్యంగా ఇలాంటి రాజకీయ జంపిగ్ లను ఆయన గతంలో ఐదు సార్లు చేశానపీ, ఇది ఆరోసారనీ విమర్శించారు. కేవలం సీఎంగా కొనసాగడమే లక్ష్యంగా ఆయన తీరు ఉందనీ, ఆయన వల్ల బీహార్ కు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. ఏ విషయంలోనూ సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూ, ఆర్జీడీలు కలిసి బీహార్ ను ఏం చేస్తారోనని భయంగా ఉందని పీకే వ్యాఖ్యానించారు. అయితే పీకే వ్యాఖ్యలను పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు. నితీష్ పై ఉన్న వ్యక్తిగత వైరానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా పీకే వ్యాఖ్యలకు కారణమని విశ్లేషిస్తున్నారు.
పీకే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ సీఎంను జాతీయ నేతగా నిలబెట్టే పనిని అంగీకరించారనీ, ఆ దిశగా ఆయన టీమ్ తెలంగాణలో పని చేస్తున్నదనీ, ఈ పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బలమైన నేతగా నితీష్ ఆవిర్బవిస్తే తెలంగాణ తనకు ఇచ్చిన ఉద్యోగం కోల్పోతుందన్న భయంతోనే బీహార్ పరిణామాలు జాతీయస్థాయిలో చూపే ప్రభావం ఏమీ ఉండదంటూ విశ్లేషణలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అదీ కాక మోడీ వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకుని మరీ పీకే మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-analysis-on-bihar-developements-attrats-criticism-from-all-fronts-39-141738.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.