పిజ్జా డాగ్!
Publish Date:Aug 26, 2022
Advertisement
మనిషికి మొదట పరిచయం అయిన జంతువు కుక్క అని అంటారు చరిత్రకారులు. కుక్కల పెంపకం పట్ల మోజు పెరుగుతూ వచ్చింది. బుజ్జి కుక్కపిల్లను పెంచుకోవడంలో అదో ఆనందం, సరదా. కేవలం కాపలాకే కాదు, అది చిన్నాచితకా ఇంటిపనుల్లో సాయం చేస్తూండడం గమనిస్తుంటాం. ఇటీవలి కాలం లో కుక్కల పెంపకం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్లలతో ఆడటం, పెద్దవాళ్లకి వాకింగ్‌లో తోడుగా వెళ్ల డం, ఇంట్లో ఎవ్వరూ లేకపోతే గేటు దగ్గరే కాపలా కాయడం అన్నింటా వాటికి ప్రత్యేకించి శిక్షణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యునిగానే కుక్కను ప్రేమగా చూసుకోవడం గమని స్తుంటాం. ఇటీవల శివాంగ్ అనే నెటిజన్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్‌కి ఎంతో సహకరిస్తోందన్నది దాని కాప్ఫ న్. ఇది ఎక్కడిది అనే ప్రశ్న వదిలేస్తే ఆ కుక్క అతనికి ఏపాటి సాయం చేస్తోందన్నది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫలానా ఇంటికి లేదా ఫ్లాట్‌కి వెళ్లి ఇవ్వమనగానే సెక్యూరిటి వాడి దగ్గరికి వెళ్లి నిల బడుతుందిట. అతను దాన్ని తీసుకుని కుక్కతో పాటు ఆ ఫ్లాట్‌కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వగానే పరు గున వచ్చి తన యజమానికి ఇచ్చేసిన సంగతి తోకతో కొట్టి మరీ చెబుతోంది! ఇలాంటి సహాయం చేసే కుక్కల్ని పెంచుకుంటే పని భారం మరీ తగ్గుతుందని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచన. ఆ కుక్క పిజ్జాబాయ్‌తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్కడ ఆపితే అక్కడ దిగి ఆ అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర ఎవరు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ తర్వాత పిజ్జా బాక్స్ తెమ్మని తోక ఊపుతుంది. ఇతగాడు పిజ్జా పట్టుకుని వెళతాడు. అదే అపార్ట్‌మెంట్లకి అయితే బండి అక్కడ గేటు దగ్గర ఆగగానే పరుగున ఫ్లాట్స్ కాపలావాడి దగ్గరికి వెళ్లి బయటికి రమ్మని గోల చేస్తుంది! రాగానే అతనికి దాని సంగతి తెలుస్తుంది. ఇది రోజూవారీ ఆ కుక్క కార్యక్రమం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో సరదాగానూ మారిందట!
http://www.teluguone.com/news/content/pizza-dog-25-142664.html





